ఈ బ్యూటీ అందానికి ఆ చందమామే చిన్నబోతుందేమో.. గ్లామర్ లుక్‌లో భాగ్య శ్రీ బొర్సే!
అదృష్టం ఎవరిని ఎలా? ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేం. కొంత మంది ఎన్నో సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాదు, కానీ కొంత మందికి మాత్రం ఒక్క సినిమాతోనే అదృష్టం వరిస్తుంది. సినిమా సక్సెస్ అయినా, కాకపోయినా హీరోయిన్స్‌కు మాత్రం విపరీతమైన క్రేజ్ వస్తుంది. అందులో ఒకరు అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బొర్సే.
Updated on: Aug 11, 2025 | 2:02 PM

తన గ్లామర్‌తో కట్టిపడేసే, అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బొర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు, తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. ముఖ్యంగా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని, యూత్ క్రష్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది, యూరియాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజ సరసన చిందులేసి తన గ్లామర్ అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్‌లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



