- Telugu News Photo Gallery Cinema photos These are the movies where the heroine's role is not important
ఈ సినిమాల్లో హీరోయిన్ ఉన్నా లేనట్లేనంట.. ఇంతకీ ఆ మూవీస్ ఏవంటే?
ఈ రోజుల్లో హీరోయిన్లకు కథల్లో ఇంపార్టెన్స్ ఉండట్లేదనే వాదన చాలా రోజులుగా వినిపిస్తుంది. కొన్నాళ్లుగా ఇది మరింత పీక్స్‌కు చేరిపోతుంది. ఏదో ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉండాలంతే అన్నట్లు మారింది సిచ్యువేషన్. ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు. మరి ఆ సినిమాలేంటో చూద్దామా..?
Updated on: Aug 11, 2025 | 2:31 PM

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత తగ్గి చాలా రోజులైపోయింది.. కానీ కనీసం ఓ అరడజన్ సీన్లు, మూడు పాటల కోసమైనా వాళ్లను తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనూ కొందరు హీరోయిన్లకు ఆ న్యాయం కూడా జరగట్లేదు. ఆ సినిమాలో వాళ్లెందుకున్నారో కూడా వాళ్లకు కూడా తెలియదు.. శృతి హాసన్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు అలాంటివే.

ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లోనే నటించిన శృతి.. ఈ మధ్య కేవలం రెమ్యునరేషన్ కోసమే నటిస్తున్నారేమో అనిపిస్తుంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, సలార్ లాంటి సినిమాల్లో శృతి పాత్ర కేవలం అలా వచ్చి పోతుంది కానీ కథలో భాగం కాదు.

కల్కిలో దిశా పటానీ కూడా అంతే. ఏదో గ్లామర్ కోసమే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది కానీ కథతో పనుండదు. ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది.

గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర గుర్తుందా..? కేవలం ఆమ్లెట్ వేయడానికి, సైడ్‌లో అలా నించోడానికి మాత్రమే ఉంటుంది కానీ ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండదు.

తాజాగా కింగ్డమ్‌లో భాగ్యశ్రీ బోర్సేకు ఆ తరహా పాత్రే దక్కింది. 2.40 గంటల సినిమాలో.. పట్టుమని 15 నిమిషాలు కనబడలేదు ఈ బ్యూటీ.. ఉన్న ఒక్క పాటను తీసేసారు.. సెకండ్ పార్ట్‌లో భాగ్యశ్రీ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందన్నారు నిర్మాత నాగవంశీ.




