- Telugu News Photo Gallery Cinema photos Bhagavanth Kesari to Leo movie latest film updates from industry
Movie News: భగవంత్ కేసరిపై కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. యూకేలో లియో రికార్డ్..
రామ్ గోపాల్ వర్మ మరోసారి పొలిటికల్ మూవీస్‌తో వస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఈయన తెరకెక్కిస్తున్న వ్యూహం పార్ట్ 1. ఈ మధ్య కాలంలో మీడియా ముందు కనిపించని చిరంజీవి.. చాలా రోజుల తర్వాత కనిపించారు. వచ్చీ రావడంతోనే ఆసక్తికర కామెంట్స్ చేసారు. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా భగవంత్ కేసరి. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ మరోసారి సోషల్ మీడియాలో వార్తలు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Oct 14, 2023 | 1:13 PM

రామ్ గోపాల్ వర్మ మరోసారి పొలిటికల్ మూవీస్‌తో వస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఈయన తెరకెక్కిస్తున్న వ్యూహం పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. సినిమా నవంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు వర్మ. తనకు వైఎస్ జగన్‌పై ఓ అభిప్రాయం ఉంది కాబట్టి సినిమా చేసానని.. తనకు అనిపించింది కాదు నిజాలు సినిమాలో చూపించానని చెప్పారు.

ఈ మధ్య కాలంలో మీడియా ముందు కనిపించని చిరంజీవి.. చాలా రోజుల తర్వాత కనిపించారు. వచ్చీ రావడంతోనే ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆర్ఆర్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ సినిమా రేంజ్‌ను మార్చేస్తాయంటే తాను నమ్మనని.. ఒళ్లు హూనుం చేసుకుని ఫైట్లు, డాన్సులు చేసి హిట్లు కొట్టడమే తనకు తెలుసు అన్నారు చిరంజీవి. ఈ మధ్య విడుదలైన భోళా శంకర్ ఫ్లాప్‌పై ఈ కామెంట్స్ చేసారు ఈయన.

డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో అలాంటిదేం లేదని మరోసారి కన్ఫర్మ్ చేసారు చిత్రయూనిట్. అనుకున్నట్లుగానే సినిమా కచ్చితంగా డిసెంబర్ 22న విడుదల కానుందని తెలిపారు మేకర్స్. డేట్‌లో ఎలాంటి మార్పు లేదని.. అనుకున్న తేదీకే సినిమా వస్తుందని కుండ బద్ధలు కొడుతున్నారు దర్శక నిర్మాతలు.

విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న లియో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా యూకేలో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే అక్కడ హైయ్యస్ట్ డే 1 కలెక్షన్స్ వసూలు చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. లండన్‌లో ఆల్ టైం హైయెస్ట్ డే 1 అందుకోబోతుంది లియో. అక్టోబర్ 19న విడుదల కానుంది ఈ చిత్రం.

బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి చెప్పిన అనిల్ రావిపూడి.. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాదని.. అందులో పాటలు, కామెడీ సీన్లు ఉండవని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే విడుదలైన 5 రోజుల తర్వాత దంచవే మేనత్త కూతురా రీమిక్స్ సాంగ్ యాడ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.





























