- Telugu News Photo Gallery Cinema photos Bhagvanth Kesari has been completed censor and will be release on Dussehra
Bhagavanth Kesari: భగవంత్ కేసరి సెన్సార్ కంప్లీట్.. దసరాకి గర్జనకు సిద్ధం..
దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి సెన్సార్ అయిపోయింది.. బాలయ్య 2023లోనే రెండోసారి యుద్ధానికి వచ్చేస్తున్నారు.. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి..? అక్కడ్నుంచి వచ్చిన రివ్యూ ఎలా ఉంది..? బాలయ్యపై అనిల్ రావిపూడి చేసిన ప్రయోగం ఫలించిందా..? అసలు నటసింహం కారెక్టర్ ఎలా ఉండబోతుంది..? శ్రీలీల రోల్ ఏంటి..? పూర్తి సెన్సార్ డీటైల్స్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Oct 14, 2023 | 12:54 PM

దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి సెన్సార్ అయిపోయింది.. బాలయ్య 2023లోనే రెండోసారి యుద్ధానికి వచ్చేస్తున్నారు.. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి..? అక్కడ్నుంచి వచ్చిన రివ్యూ ఎలా ఉంది..? బాలయ్యపై అనిల్ రావిపూడి చేసిన ప్రయోగం ఫలించిందా..? అసలు నటసింహం కారెక్టర్ ఎలా ఉండబోతుంది..? శ్రీలీల రోల్ ఏంటి..? పూర్తి సెన్సార్ డీటైల్స్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దాంతో భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ముందుగానే ఫిక్సైపోయారు బాలయ్య ఫ్యాన్స్. దానిపై బజ్ కూడా అలాగే ఉంది.. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగింది. సాహు గురపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భగవంత్ కేసరిని నిర్మించారు. అనిల్ రావిపూడి తనను తాను ఈ సినిమాతో కొత్తగా ప్రజెంట్ చేసుకున్నారు.

సాధారణంగా బాలయ్య సినిమా అంటే ఫుల్ కమర్షియల్ హంగులుంటాయి.. ఇక అనిల్ రావిపూడి అంటే కేరాఫ్ ఎంటర్‌టైన్మెంట్. అలాంటి ఇద్దరూ భగవంత్ కేసరికి కలవడంతో.. ఇటు కమర్షియల్, అటు ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా ఉండదని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. కానీ అలాంటి ఊహలకు బ్రేక్ వేసారు అనిల్ రావిపూడి. సెన్సార్ టాక్ బట్టి చూస్తే.. భగవంత్ కేసరి రెగ్యులర్ సినిమా కాదు.

రెగ్యులర్ ఆరు పాటలు, నాలుగు కామెడీ సీన్స్ కైండ్ ఆఫ్ సినిమాలా కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నించారు అనిల్ రావిపూడి. బాలయ్య సైతం పూర్తిగా కథకు లొంగిపోయి భగవంత్ కేసరిలో ఒదిగిపోయారని తెలుస్తుంది. ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అంటున్నారు సెన్సార్ సభ్యులు. అలాగే శ్రీలీల, బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని.. థమన్ ఆర్ఆర్ ప్రాణం అనే టాక్ వినిపిస్తుంది.

ఇంటర్వెల్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని అనిల్ రావిపూడి చెప్పారు. దానికి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడంటున్నారాయన. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. అలాగే కాజల్, బాలయ్య సీన్స్ సరదాగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. కచ్చితంగా బాలయ్య నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో కనిపించారనే టాక్ అయితే బలంగా వస్తుంది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. అక్టోబర్ 19న విడుదల కానుంది భగవంత్ కేసరి.





























