- Telugu News Photo Gallery Cinema photos Hrithik Roshan took the Mumbai metro to work and he shared his experience in the form of an Instagram post
Hrithik Roshan: మెట్రోలో ప్రయాణించిన హృతిక్ రోషన్.. అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన స్టార్ హీరో
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు. తాజాగా హృతిక్ రోషన్ తన కారును వదిలి ముంబైలో దిలి మెట్రో ఎక్కాడు.హృతిక్ రోషన్ బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Updated on: Oct 14, 2023 | 1:17 PM

దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు. తాజాగా హృతిక్ రోషన్ తన కారును వదిలి ముంబైలో దిలి మెట్రో ఎక్కాడు.

హృతిక్ రోషన్ బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ లగ్జరీ కార్లలోనే ట్రావెల్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

హృతిక్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో ఇలా మెట్రో ఎక్కాడు.

హృతిక్ మెట్రో ప్రయాణంలో తన అనుభవాన్ని పంచుకున్నాడు. హృతిక్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.

హృతిక్ రోషన్‌ని చూడటానికి ఎగబడ్డారు అభిమానులు. మెట్రోలో ప్రయాణికులు తక్కువ ఉండటంతో హృతిక్ ఓపికగా తన అభిమానులతో సెల్ఫీలు దిగాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు హృతిక్.





























