Anasuya Bharadwaj: అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి.. అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అందాల హాట్ యాంకరమ్మ అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది అనసూయ. జబర్దస్త్ షోతో హాట్ యాంకర్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అదే క్రేజ్ తో సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి ఆకట్టుకుంది.
Updated on: Oct 14, 2023 | 1:23 PM

అందాల హాట్ యాంకరమ్మ అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది అనసూయ.

జబర్దస్త్ షోతో హాట్ యాంకర్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అదే క్రేజ్ తో సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.

అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది అనసూయ.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో పాటు, తన పై వచ్చే ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ.. కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. అలాగే అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తాజాగా ఓ నెటిజన్స్ మీరు పెద్దకపు సినిమాలో తెలంగాణలో మాట్లాడి ఆకట్టుకున్నారు అని అన్నాడు. మరో నెటిజన్ మీది ఏపీ అనుకున్నాను అన్నాడు. దానికి అనసూయ రిప్లే ఇస్తూ.. "అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి.. కానీ నిజం అనేది ఒక్కటే ఉంటుంది కదా.. నేను హైదరాబాద్‌లోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే చదువుకున్నాను అని రాసుకొచ్చింది అనసూయ.





























