- Telugu News Photo Gallery Cinema photos Renu Desai Interesting Comments About Tiger Nageswara Rao Movie
Renu Desai : ఈ సినిమా నా వ్యక్తిగత జీవితం పై ప్రభావం చూపింది.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటి రేణుదేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండు దేశాయ్. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పవన్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత చాలా కాలానికి జానీ సినిమాలో కనిపించరు రేణు దేశాయ్. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు బ్రేక్ తీసుకుంది.
Updated on: Oct 14, 2023 | 1:32 PM

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటి రేణుదేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రెండు దేశాయ్. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆ తర్వాత పవన్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత చాలా కాలానికి జానీ సినిమాలో కనిపించరు రేణు దేశాయ్. ఆ తర్వాత మళ్లీ సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

ఇక ఇప్పుడు మరోసారి సినిమాలతో బిజీ కానుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు రేణు. ఈ సినిమాలో హేమలతా లవణం పాత్రలో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరరావు సినిమా నా వ్యక్తిగత జీవితం పై కూడా గట్టి ప్రభావం చూపించింది. నేను చేస్తున్న సామజిక సేవలు సరిపోవని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు అర్థమైంది.

అలాగే తన కొడుకు గురించి మాట్లాడుతూ.. అకీరా నందన్ ఫిలిం మేకింగ్ కోర్స్ చేయడం కోసం అమెరికా వెళ్లాడని తెలిపారు. కానీ నటన నేర్చుకోవడానికి కాదు. తనకి హీరో కావాలనే కోరిక ఈ క్షణం వరకూ లేదు. రేపు తన ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.





























