- Telugu News Photo Gallery Cinema photos Bhagavanth Kesari to Game Changer latest movie updates from film industry
Film Updates: చాలా రోజుల తర్వాత మొదలైన గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్.. ప్రమోషన్స్‌లో బాలయ్య, రవితేజ..
చిరంజీవి ఇప్పటికీ షూటింగ్‌కు రాలేదు.. ఈయనకు మరికొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు.. మరోవైపు చాలా రోజుల తర్వాత గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలైంది.. బాలయ్య, రవితేజ తమ కొత్త సినిమాల ప్రమోషన్‌తో బిజీ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాల మధ్య నలిగిపోతున్నారు. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్‌లోనే ఉన్నారు. మరి ఆ డీటైల్స్ చూద్దామా..?
Updated on: Oct 17, 2023 | 12:13 PM

చిరంజీవి ఇప్పటికీ షూటింగ్‌కు రాలేదు.. ఈయనకు మరికొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు.. మరోవైపు చాలా రోజుల తర్వాత గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ మొదలైంది.. బాలయ్య, రవితేజ తమ కొత్త సినిమాల ప్రమోషన్‌తో బిజీ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాల మధ్య నలిగిపోతున్నారు. వీళ్లు మినహా హీరోలందరూ లొకేషన్‌లోనే ఉన్నారు. మరి ఆ డీటైల్స్ చూద్దామా..?

భగవంత్ కేసరి ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు బాలయ్య. దాంతో పాటే అన్‌స్టాపబుల్ 3కి కూడా డేట్స్ ఇచ్చారు. అక్టోబర్ 17న సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరోవైపు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా దేశమంతా ఓ రౌండ్ వేస్తున్నారు. ఇక చిరంజీవి ఇప్పటికీ రెస్ట్‌లోనే ఉంటే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది.

ప్రభాస్ ఇండియాలో లేకపోయినా ఆయన సినిమాల షూటింగ్స్ ఆగట్లేదు. ఓ వైపు శంకరపల్లిలో నాగ్ అశ్విన్ కల్కి షూటింగ్ జరుగుతుంటే.. RFCలో సలార్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది. దేవర షూటింగ్ శంషాబాద్‌లోనే కొన్ని వారాలుగా నడుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలో జరుగుతుంది.. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌కు లీడ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్.

నాగార్జున నా సామిరంగా షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌కు షిఫ్ట్ అయింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతుంది.

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా అల్యూమీనియం ఫ్యాక్టరీలో.. విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా ముంబైలో జరుగుతున్నాయి. నాని హాయ్ నాన్న ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.