బాబీ, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న NBK 109 షూటింగ్ సెప్టెంబర్ 14 నుంచి రాజస్థాన్‌లో జరగనుంది. అలాగే సెప్టెంబర్ 11 నుంచి హిట్ 3తో హైదరాబాద్‌లోనే బిజీ కానున్నారు నాని. సిద్ధూ జొన్నలగడ్డ, నీరజ కోన సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది. దీంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న జాక్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 15 నుంచి మొదలు కానుంది.