- Telugu News Photo Gallery Cinema photos Hero Prabhas and Vijay thalapathy movies highest collections movies Telugu Heroes Photos
Prabhas vs Vijay Thalapathy: ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
మీరు రికార్డ్స్ కొట్టాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి.. లాంగ్ రన్ ఉండాలేమో.? మాకు జస్ట్ సినిమా రిలీజైతే చాలు అంటున్నారు ఇద్దరు హీరోలు. సౌత్ ఇండస్ట్రీలో వాళ్ల దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వరసగా వందల కోట్లు వసూలు చేస్తూ.. రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్లు. మరి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న హీరోలెవరు.? అడుగేస్తే రికార్డులు.. సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు..
Updated on: Sep 11, 2024 | 9:21 PM

మీరు రికార్డ్స్ కొట్టాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి.. లాంగ్ రన్ ఉండాలేమో.? మాకు జస్ట్ సినిమా రిలీజైతే చాలు అంటున్నారు ఇద్దరు హీరోలు. సౌత్ ఇండస్ట్రీలో వాళ్ల దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

వరసగా వందల కోట్లు వసూలు చేస్తూ.. రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్లు. మరి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న హీరోలెవరు.? అడుగేస్తే రికార్డులు.. సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు..

హ్యాంగర్‌కు ఉన్న చొక్కా వేసుకొచ్చినంత ఈజీగా ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు ఇద్దరు సౌత్ హీరోలు. వాళ్లే ప్రభాస్ అండ్ విజయ్. కొన్నేళ్లుగా రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా లేదు.. అలాగే విజయ్ కూడా అదే దూకుడు చూపిస్తున్నారు.

తాజాగా గోట్ సైతం 300 కోట్లు దాటి.. 400 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. టాక్‌తో పనిలేదు.. ప్రభాస్, విజయ్ నుంచి సినిమాలు వస్తే చాలు రికార్డులు కుదేలవుతున్నాయి.

అలాగే ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. వీళ్ళందరి ఆశ ఒక్కటే.. ప్రభాస్‌తో హిట్ కొడితే 1000 కోట్లతో పాటు బోనస్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనే ముద్ర పడుతుంది.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్.. ప్రశాంత్ నీల్ సలార్ 2.. నాగ్ అశ్విన్ కల్కి 2 లైన్‌లోనే ఉన్నాయి. వీటితో పాటు తాజాగా లోకేష్ కనకరాజ్ సైతం ప్రభాస్‌తో సినిమా కోసం ట్రై చేస్తున్నారు.

ఇక ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్ సలార్ 2 టీమ్ నుంచి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రీ స్టార్ట్ చేశారన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.




