- Telugu News Photo Gallery Cinema photos Are the films ready for release in August going to loot crores?
August Movies: పుష్పరాజ్ మిస్ చేసుకున్న ఆగష్టు.. ఆ సినిమాలు కాష్ చేసుకోనున్నాయా..
ఆగస్టు వచ్చినప్పటి నుంచీ... ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్‌ని కలవరించేవారి సంఖ్య పెరుగుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో వెయ్యి కోట్లు సాధించగల సత్తా ఉన్న సినిమాని ఈ నెల మిస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. వస్తున్న సినిమాల్లో అయినా కలెక్షన్లు కొల్లగొట్టగలవి ఏం ఉన్నాయో... అని డిస్కస్ చేసుకుంటున్నారు... జనాలు
Updated on: Aug 06, 2024 | 8:00 AM

పుష్ప2 .జస్ట్ అలా డేట్‌ని వద్దనుకున్నదో లేదో, చకచకా ఆ డేట్‌ని కబ్జా చేసేశాయి మిగిలిన సినిమాలు. గత శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఈ వారం కూడా కమిటీ కుర్రోళ్లు తప్ప పెద్దగా మాట్లాడుకోదగ్గ మూవీస్ లేవు. కానీ ఆగస్టు 15న మాత్రం తెలుగు నుంచి మూడు సినిమాలతో పాటు పొరుగు నుంచి తంగలాన్ రిలీజ్‌కి రెడీ అయిపోతోంది.

విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ ఆద్యంతం న్యూ జోనర్‌లో కనిపిస్తోంది. ఈ తరహా సబ్జెక్టులు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కోట్లు కురవడం ఖాయం. అదే, ఏమాత్రం బెడిసికొట్టినా రెండో ఆటకే జనాలను అట్రాక్ట్ చేయడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని గమనించే పబ్లిసిటీలో జోరు పెంచారు మాస్ మహరాజ్

మిస్టర్ బచ్చన్‌తో ఆగస్టు 15న థియేటర్లలోకి దూసుకొస్తున్నారు రవితేజ. హరీష్ డైరక్షన్‌లో రవితేజ చేస్తున్న సినిమా అనగానే బిజినెస్ సర్కిల్స్ లోనూ మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ థియేటర్లలోనూ రిఫ్లెక్ట్ కావాలని కోరుకుంటున్నారు మేకర్స్.

ఇటు ఇస్మార్ట్ పాజిటివ్ వైబ్స్, డబుల్ ఇస్మార్ట్ కి విజిటింగ్ కార్డులా ఉపయోగపడతాయన్నది పూరి అండ్ రామ్ కాన్ఫిడెన్స్.నైజామ్ ఎగ్జిబిటర్ల ఇష్యూ క్లియర్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి పెద్ద రిలీఫ్ దొరికినట్టే. సినిమాలో సత్తా ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్‌లో అసలు తిరుగే ఉండదు. ఆ నెక్స్ట్ వీక్ కూడా థియేటర్లలో సినిమాలు లేవు కాబట్టి, కలెక్షన్లు కొల్లగొట్టేయవచ్చనే ధీమా కనిపిస్తోంది పూరిలో.

ఈ సినిమాలన్నీ థియేటర్లను ఖాళీ చేసేశాక... మంత్ ఎండింగ్‌లో ఫ్రెష్ గా పలకరించడానికి రెడీ అవుతున్నారు నాని. ఆగస్టు 29న రిలీజ్ అయ్యే సరిపోదా శనివారం మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు నేచురల్ స్టార్.




