- Telugu News Photo Gallery Cinema photos Anirudh Ravichander The Music Maestro Behind Rajinikanth's Success
Anirudh Ravichander: సూపర్ స్టార్ రజినీకాంత్‌కే హైప్ ఎక్కిస్తున్న అనిరుధ్..
రజినీకాంత్ అనే పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి.. ఆయన్ని ప్రత్యేకంగా ఒకరు వచ్చి హైలైట్ చేయాలా..? సూపర్ స్టార్ ఇమేజ్‌కు ఇంకొకరు వచ్చి హైప్ ఇవ్వాలా..? కొన్నిసార్లు తప్పదు చేయాల్సి వస్తుంది.. అక్కడున్నది రజినీ అయినా ఇంకొకరి సాయం తీసుకోక తప్పదు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మరి సూపర్ స్టార్‌కే హైప్ ఎక్కిస్తున్నదెవరు..?
Updated on: Jul 25, 2025 | 12:46 PM

బాలయ్యకు బండోడు.. రజినీకాంత్‌కు బక్కోడు.. ఈ లైన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇక్కడ బండోడు అంటే థమన్.. బక్కోడు అంటే అనిరుధ్. కొన్నేళ్లుగా రజినీ సినిమా అంటే చాలు అనిరుధ్ పేరు తప్ప మరో పేరు ఆ పోస్టర్‌పై కనిపించట్లేదు.

తాజాగా కూలీకి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.. పవర్ హౌజ్ పాటతో మరోసారి రప్ఫాడిస్తున్నారు అనిరుధ్. రజినీకాంత్ ఇమేజ్‌ని తన మ్యూజిక్‌తో కొన్నేళ్లుగా మరింత పెంచేస్తున్నారు అనిరుధ్.

జైలర్ హిట్‌కు అనిరుధ్ మ్యూజిక్ కీలకం అంటే అతిశయోక్తి కాదు. దానికి ముందు పేట, దర్బార్, వేట్టయాన్ లాంటి సినిమాలకు ఖతర్నాక్ మ్యూజిక్ ఇచ్చారు అనిరుధ్.

తాజాగా కూలీకి అదే చేస్తున్నారు.. మోనికా సాంగ్ చార్ట్ బస్టర్ కాగా.. పవర్ హౌజ్ దుమ్ము దులిపేస్తుంది.రజినీకాంత్ సినిమా అంటే చాలు అనిరుధ్ వైపు వెళ్తున్నారు మేకర్స్. పైగా మనోడి టైమ్ నడుస్తుందిప్పుడు.

మరో వారంలో కింగ్డమ్ సినిమాతో రానున్నారు అనిరుధ్.. అలాగే మొన్న రామ్ సినిమాలో అని పాడిన పాటకు నెక్ట్స్ లెవల్ రెస్పాన్స్ వస్తుంది.. ఇక చేతిలో దేవర 2, జైలర్ 2, జన నాయగన్, టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలున్నాయి.




