- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actresses Rashmika Mandanna,Sreeleela and Bhagyashri Borse Aiming for a Comeback
కమ్‌బ్యాక్ కోసం స్టార్ హీరోయిన్ల తంటాలు.. ఇప్పటికైన వీళ్ళ కల నెరవేరేనా?
హిట్టు లేకపోతే ఇక్కడ ఎవరూ చూడరు. గతమెంతో ఘనం అంటే పట్టించుకోరిక్కడ.. ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ..! ప్రస్తుతం అలాంటి కమ్ బ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయ్ అని చెప్పడం కాదు.. ఇప్పుడు హిట్లు కొడతాం అని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకుని బయల్దేరారు కొందరు హీరోయిన్లు. వాళ్లపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Jul 25, 2025 | 12:58 PM

వరసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలెప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడెళ్తున్నాయో కూడా తెలియట్లేదు ఆమె సినిమాలు. ఈ ఏడాది రాబిన్ హుడ్, జూనియర్ సినిమాలతో వచ్చినా ఫలితం లేదు. కంటెంట్‌పై ఫోకస్ పెట్టమ్మా.. గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్.

స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. రవితేజ మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి.. హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో శ్రీలీలకు కమ్ బ్యాక్ ఇచ్చే సినిమా ఏదవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే సైతం మాంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై 31న రానుంది.. అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్రాకింగ్ తాలూక సినిమాలు 2025లోనే రానున్నాయి. వీటితో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ.

ఇక రష్మిక మందన్నకు హిట్స్ ఉన్నాయి కానీ గ్యాప్ ఎక్కువగా ఇస్తున్నారు. పుష్ప 2 తర్వాత మొన్న కుబేరాతో వచ్చారు. త్వరలోనే రెయిన్ బో, గాళ్ ఫ్రెండ్ అంటూ గ్యాప్ లేకుండా వస్తున్నారు.

హిట్ 3 బానే ఆడినా శ్రీనిథి శెట్టి పేరు పెద్దగా వినిపించట్లేదు. అక్టోబర్ 17న తెలుసు కదా అంటూ మరోసారి పలకరించబోతున్నారు ఈ బ్యూటీ. అలాగే మంచి కథ దొరికితే తెలుగులో నటిస్తానంటున్నారు సమంత. ఖుషీ తర్వాత ఈమె కనబడలేదు. త్రిష సినిమాలు చేస్తున్నా.. విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. మరి వీళ్లలో ఎంతమందికి కోరుకున్న కమ్ బ్యాక్ వస్తుందో చూడాలిక.




