- Telugu News Photo Gallery Cinema photos Animal Movie Fame Tripti Dimri Photoshoot For Vogue Magazine Cover Page
Tripti Dimri: పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీపై ‘యానిమల్’ బ్యూటీ.. ట్రెండింగ్‌లో తృప్తి డిమ్రి ఫొటోస్
రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి. ఇందులో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయినా తృప్తికే ఎక్కువ మార్కులు పడ్డాయి. అమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.
Updated on: Mar 01, 2024 | 8:10 PM

రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి. ఇందులో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయినా తృప్తికే ఎక్కువ మార్కులు పడ్డాయి. అమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. (Photo Credit: Vogue)

యానిమల్ క్రేజ్ తో ఒక్కసారిగా బిజీ అయిపోయిందీ అందాల తార. ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. (Photo Credit: Vogue)

తెలుగులోనూ పలువురి యంగ్ హీరోల సినిమాల్లో తృప్తి దిమ్రి నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అందులో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా కూడా ఒకటి ఉందని సమాచారం. (Photo Credit: Vogue)

ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ పై మెరిసింది తృప్తి దిమ్రీ. రెడ్, వైట్, బ్లాక్ కలర్ దుస్తుల్లో హొయలు పోతూ కెమెరాకు పోజులిచ్చింది.(Photo Credit: Vogue)

ప్రముఖ మ్యాగజైన్పై ధగధగా మెరిసిపోతోన్న తృప్తి దిమ్రి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. (Photo Credit: Vogue)

యానిమల్ తర్వాత ఆషికీ 3, భూల్ భూలయ్యా 3 తదితర బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో తృప్తి దిమ్రీ నటిస్తుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాల అప్ డేట్స్ రానున్నాయి. (Photo Credit: Vogue)




