AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ట్రాక్‌ మారుస్తున్న అనిల్‌.. హీరోల కోసమేనా

మామూలుగా డైరక్టర్ల పేర్లు చెప్పగానే వాళ్లు చేసిన సినిమాలు చకచకా గుర్తుకొచ్చేస్తుంటాయి. వాటి జోనర్లను బట్టి, వాళ్ల మీద ఏదో ఒక రకమైన స్టాంప్‌ పడుతుంటుంది. అయితే, అలాంటి ముద్ర తన మీద పడకూడదని గట్టిగా ఫిక్సయ్యారు అనిల్‌ రావిపూడి. ఇంతకు ముందు మీరు చూసింది వేరు.. ఇప్పుడు మీరు చూస్తున్నది వేరు అని చెప్పకనే చెబుతోంది ఆయన స్టోరీ సెలక్షన్‌. ఫక్తు కమర్షియల్‌ సినిమాల్లో కడుపుబ్బ నవ్వించే కామెడీ కావాలంటే, అనిల్ రావిపూడి సినిమాలు మిస్‌ కావద్దు అని ఆ మధ్య ఓ మాట వైరల్‌ అయింది.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Apr 13, 2024 | 1:15 PM

Share
మామూలుగా డైరక్టర్ల పేర్లు చెప్పగానే వాళ్లు చేసిన సినిమాలు చకచకా గుర్తుకొచ్చేస్తుంటాయి. వాటి జోనర్లను బట్టి, వాళ్ల మీద ఏదో ఒక రకమైన స్టాంప్‌ పడుతుంటుంది. అయితే, అలాంటి ముద్ర తన మీద పడకూడదని గట్టిగా ఫిక్సయ్యారు అనిల్‌ రావిపూడి. ఇంతకు ముందు మీరు చూసింది వేరు.. ఇప్పుడు మీరు చూస్తున్నది వేరు అని చెప్పకనే చెబుతోంది ఆయన స్టోరీ సెలక్షన్‌.

1 / 5
ఫక్తు కమర్షియల్‌ సినిమాల్లో కడుపుబ్బ నవ్వించే కామెడీ కావాలంటే, అనిల్ రావిపూడి సినిమాలు మిస్‌ కావద్దు అని ఆ మధ్య ఓ మాట వైరల్‌ అయింది. ఆయన చేసిన పటాస్‌,  రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2... ఇవన్నీ ఆ తరహా సినిమాలే.

2 / 5
మహేష్‌బాబులాంటి స్టార్‌తో సినిమా చేసినా, తన మార్కు కామెడీని వదిలిపెట్టలేదు అనిల్‌ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ మేనరిజాన్నే మార్చేశారు ఈ కెప్టెన్‌. అంతే కాదు, చిన్న పెద్దా అని తేడా లేకుండా, ఆర్టిస్టులందరితో తనవైన పంచ్‌ డైలాగులు చెప్పించి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టేశారు.

3 / 5
ఆ తర్వాత కూడా ఎఫ్‌3ని అదే జోనర్‌లో చేశారు. అయితే ఎఫ్‌3 కలెక్షన్లలో అంతకు ముందున్న జోష్‌ కాస్త మిస్‌ అయింది. రీజన్‌ అదే అయినా, కాకపోయినా... భగవంత్‌ కేసరి సినిమా టైమ్‌కి అనిల్‌లో చాలా మార్పు వచ్చింది. నందమూరి బాలకృష్ణలాంటి హీరోని సరికొత్తగా చూపించడం కోసం... తనను తాను మార్చుకున్నారు అనిల్‌. తన ట్రాక్‌ మార్చి తీసిన బొమ్మను సక్సెస్‌ చేసి చూపించారు.

4 / 5
అనిల్‌ నెక్స్ట్ సినిమా అతని పంథాలోనే ఉంటుందా? లేకుంటే కొత్తగా ఉంటుందా? అని ఎదురుచూసిన వారికి లేటెస్ట్ గా అనౌన్స్ అయిన వెంకటేష్‌ సినిమా సమాధానం చెప్పింది. ఆల్రెడీ విక్టరీ స్టార్‌తో ఎఫ్‌2, ఎఫ్‌3 చేసిన అనిల్‌, ఈ సారి సరికొత్త జోనర్‌ని సెలక్ట్ చేసుకున్నారు. తమ కాంబోకి కలిసొచ్చిన కామెడీని కంటిన్యూ చేస్తూనే, దానికి క్రైమ్‌ని యాడ్‌ చేశామన్నారు అనిల్‌. మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేష్ కేరక్టర్‌ని ఈ కెప్టెన్‌ ఎలా డిజైన్‌ చేశారో తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

5 / 5