- Telugu News Photo Gallery Cinema photos Anant Ambani, Radhika Merchant Wedding, See Her Mangalsutra and Ring Design Photos Goes Viral
Anant Ambani-Radhika Merchant: రాధిక ఉంగరంలో అనంత్ ప్రేమ.. రింగ్, మంగళసూత్రం చాలా ప్రత్యేకం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేశారు. వీరిద్దరి పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు.
Updated on: Jul 14, 2024 | 4:51 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేశారు.

వీరిద్దరి పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. ఇక నిన్న జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలోనూ దేశంలోని రాజకీయ ప్రముఖులు, పీఎం నరేంద్రమోడీ హాజరయ్యారు.

జూలై 13న జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రాధిక మరింత అందంగా కనిపించింది. గోల్డ్ జర్దోసీ వర్క్, హ్యాండ్ పెయింటింగ్ చేసిన పింక్ కలర్ లెహాంగాలో మరింత అద్భుతంగా కనిపించింది. ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

అలాగే రాధిక మంగళసూత్రం, ఉంగరం ప్రత్యేకంగా కనిపించింది. రాధిక మెడులో నల్లపూసలతో సరళమైన మంగళసూత్రం కనిపించింది. వేడుకకు వచ్చిన అతిథులతో రాధిక దిగిన ఫోటోలలో ఆమె మంగళసూత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక రాధిక ధరించిన డైమండ్ ఉంగరం చాలా ప్రత్యేకమైనది. ఆ ఉంగరాన్ని అనంత్, రాధిక పేరుతో 'RA' అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాధిక ధరించిన డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

రాధిక ఉంగరంలో కనిపించిన అనంత్ ప్రేమ..




