- Telugu News Photo Gallery Cinema photos Heroine Priyanka Mohan gets more offers in second inning, details here Telugu Actress Photos
Priyanka Mohan: చిన్న గ్యాప్ అంతే.. ఇప్పుడు అస్సలు తీరికలేనన్ని సినిమాలతో ప్రియాంక.
ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీకి.. వరస అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్..? ప్రియాంక మోహన్.. ఐదేళ్ళ కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.
Updated on: Jul 14, 2024 | 3:31 PM

ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీకి..

వరస అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్..? ప్రియాంక మోహన్.. ఐదేళ్ళ కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు.

ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడి గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి.. డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు టైమ్ వచ్చింది. ప్రియాంక మోహన్‌కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరస ఛాన్సులు వస్తున్నాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. OG సెట్స్‌పై ఉండగానే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

విలన్ బర్త్ డేకి హీరోకి ఎలివేషన్ ఇస్తూ, హ్యాపీ బర్త్ డే సార్ అంటూ టీజర్ రిలీజ్ చేయడం బావుందనే అంటున్నారు నెటిజన్లు. సరిపోదా శనివారం పాటలను కూడా పనిలో పనిగా గుర్తుచేసుకుంటున్నారు. ఆగస్టు 29న విడుదల కానుంది సరిపోదా శనివారం.

తాజాగా ఇందులోంచి ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. చారులత పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక. తమిళంలోనూ ఈమె బిజీగానే ఉన్నారు. ఈ మధ్యే ధనుష్ పాన్ ఇండియన్ సినిమా కెప్టెన్ మిల్లర్‌లో నటించారు ప్రియాంక మోహన్.

ఇక ప్రస్తుతం జయం రవితో బ్రదర్ సినిమాలోనూ నటిస్తున్నారు ప్రియాంక. టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో ప్రియాంక మోహన్ పేరు పరిశీలనలో ఉంది. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఖతర్నాక్ ప్రాజెక్ట్స్‌తో ఫామ్‌లోకి వచ్చారు ఈ బ్యూటీ.




