- Telugu News Photo Gallery Cinema photos Kamal Haasan's Bharateeyudu 3 movie shooting Update details here Telugu Heroes Photos
Bharateeyudu 3: షూటింగ్ పూర్తిచేసుకున్న భారతీయుడు 3.. అతి త్వరలోనే రిలీజ్.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు. 28 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే సీక్వెల్‌తో పాటు త్రీక్వెల్‌ను కూడా రెడీ చేసిన మేకర్స్, షార్ట్ గ్యాప్‌లోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అసలు కథ అంతా పార్ట్ 3లోనే ఉంటుందన్న హింట్ ఇచ్చారు. భారతీయుడు 2 గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. భారతీయుడుకి చావే లేదంటూ మరోసారి యాక్షన్‌లోకి దిగిన కమల్ హాసన్, థియేటర్లలో సందడి చేస్తున్నారు.
Updated on: Jul 14, 2024 | 5:26 PM

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా భారతీయుడు. 28 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన. మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు.

భారతీయుడుకి చావే లేదంటూ మరోసారి యాక్షన్‌లోకి దిగిన కమల్ హాసన్, థియేటర్లలో సందడి చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నట్టుగా భారతీయుడు 2 ఎండింగ్‌లో సర్‌ప్రైజ్ యాడ్ చేసింది యూనిట్.

భారతీయుడు 3కి సంబంధించిన లెంగ్తీ ట్రైలర్ పార్ట్ 2తో పాటు యాడ్ చేశారు. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్‌కి కూడా కంటెంట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథ అంతా త్రీక్వెల్‌లోనే చూపించబోతున్నారు మేకర్స్.

పార్ట్ 2లో ఫోకస్ అంతా ప్రజెంట్ సోసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దాని మీదే ఫోకస్ చేశారు. నెక్ట్స్ పార్ట్‌లో సేనాపతి గతం ఏంటో చూపించబోతున్నారు శంకర్.

అంతేకాదు పార్ట్ 3లో యంగ్ కమల్ హాసన్ ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? లాంటి డిటైల్స్ కూడా పార్ట్ 3లో చూపించబోతున్నారు.

ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయ్యింది వార్ మోడ్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కమల్ హాసన్ 1996 రోజులను మళ్లీ గుర్తు చేస్తారేమో చూడాలి.




