- Telugu News Photo Gallery Cinema photos Sara Ali Khan Photshoot with Her Brother Ibrahim Ali Khan After Anant Ambani Radhika Merchant Wedding
Sara Ali Khan: నెటిజన్స్ హృదయాలను దొచేస్తోన్న సారా అలీ ఖాన్.. తమ్ముడితో కలిసి ఫోటోషూట్..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో తన తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఈ వేడుకలలో పాకిస్తానీ డిజైనర్ ఇక్పాల్ హుస్సేన్ రూపొందించిన దుస్తులను ఎంపిక చేసుకుంది. అంబానీ పెళ్లి వేడుకలకు ముందు తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఫోటోషూట్ చేసింది సారా అలీ ఖాన్.
Updated on: Jul 14, 2024 | 5:45 PM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో తన తమ్ముడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఈ వేడుకలలో పాకిస్తానీ డిజైనర్ ఇక్పాల్ హుస్సేన్ రూపొందించిన దుస్తులను ఎంపిక చేసుకుంది.

అంబానీ పెళ్లి వేడుకలకు ముందు తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఫోటోషూట్ చేసింది సారా అలీ ఖాన్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ్ముడిపై ప్రేమను కురిపించింది. అలాగే తమ్ముడి కోసం ప్రత్యేకంగా కవితను షేర్ చేసింది.

అంబానీ వివాహానంతర వేడుకల కోసం సారా ఐవరీ, గోల్డ్ లెహంగాను ఎంచుకుంది. బంగారం, గోధుమ రంగు కలయికలో ఉన్న లెహాంగాను ఎంపిక చేసుకుంది. తన లుక్ పూర్తి చేసేందుకు స్టేట్‌మెంట్ చోకర్, సున్నితమైన జుంకాలను ఎంచుకుంది.

ఇక సారా తమ్ముడు ఇబ్రహీం అలీ కాన్ రాఘవేంద్ర రాథోడ్ రూపొందించిన రీగల్ ఐవరీ బ్యాండ్ గాలా జాకెట్ ధరించారు. క్లోజ్డ్ కాలర్ తోపాటు.. చిన్న బటన్ తో కూడిన ప్యాకెట్ తో సంప్రదాయ భారతీయ జాకెట్.. క్రీమ్ కలర్ లో ఉన్న కుర్తి ధరించి తన లుక్ పూర్తి చేశాడు.

ప్రస్తుతం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్క తమ్ముడి మధ్య ఆప్యాయతను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సారా అలీ ఖాన్ అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న మెట్రో ఇన్ డినోలో నటిస్తుంది.




