- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun shares his daughter Allu Arha birthday celebrations telugu cinema news
Allu Arha: అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ పుట్టినరోజు.. కూతురితో బన్నీ స్పెషల్ మూమెంట్స్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే తన చిలిపి అల్లరితో.. ముద్దు ముద్దు మాటలతో అభిమానులను సంపాదించుకుంది. అర్హకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. తమ కూతురి క్యూట్ ఫోటోస్.. చిలిపి అల్లరికి సంబంధించిన విషయాలను రెగ్యులర్గాసోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి. అల్లు అర్జున్ సైతం షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు సమయం కేటాయిస్తారు.
Updated on: Nov 22, 2023 | 12:09 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే తన చిలిపి అల్లరితో.. ముద్దు ముద్దు మాటలతో అభిమానులను సంపాదించుకుంది. అర్హకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.

తమ కూతురి క్యూట్ ఫోటోస్.. చిలిపి అల్లరికి సంబంధించిన విషయాలను రెగ్యులర్గాసోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.

అల్లు అర్జున్ సైతం షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు సమయం కేటాయిస్తారు. కూతురు అర్హ, కొడుకు అయాన్‌తో కలిసి ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు.

నవంబర్ 21 అల్లు అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇటీవల వరుణ్ తేజ్ పెళ్ళలో అర్హ దిగిన కొన్ని క్యూట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ గారాలపట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్ దంపతులు.

ఇక నిన్న బర్త్ డే సెలబ్రేషన్లలో భాగంగా తన కూతురితో సరదాగా ఎంజాయ్ చేస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా సంతోషం అంటూ అర్హ గురించి పోస్ట్ చేశాడు.

ఇక నిన్న బర్త్ డే సెలబ్రేషన్లలో భాగంగా తన కూతురితో సరదాగా ఎంజాయ్ చేస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా సంతోషం అంటూ అర్హ గురించి పోస్ట్ చేశాడు.





























