- Telugu News Photo Gallery Cinema photos Alia bhatt and kriti sanon together wins Best Actress in 69th national awards Telugu Actress Photos
Alia Bhatt – Kriti Sanon: కెరియర్ పీక్స్ లో స్టార్ హీరోయిన్లు రిస్క్.. బట్ సక్సెస్ కొట్టారు..
69వ నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డ్‌ను అలియా భట్, కృతి సనన్ షేర్ చేసుకున్నారు గంగూభాయ్ కతియావాడి సినిమాకు గానూ అలియా భట్, మిమి సినిమాకు గానూ కృతి సనన్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల సెలక్షన్ విషయంలో హీరోయిన్ల మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన గంగూభాయ్ కతియావాడి సినిమాలో వేశ్యపాత్రలో నటించారు అలియా..
Updated on: Aug 26, 2023 | 9:47 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నేషనల్ అవార్డ్స్ మీద చర్చ జరుగుతోంది. వివాదాల సంగతి పక్కన పెడితే... బెస్ట్ హీరోయిన్ కేటగిరిలో అవార్డు సాధించిన ఇద్దరు అందాల భామల గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు. ఈ బ్యూటీస్ అప్ కమింగ్ హీరోయిన్స్‌కు ఇన్‌స్పిరేషన్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

69వ నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డ్‌ను అలియా భట్, కృతి సనన్ షేర్ చేసుకున్నారు గంగూభాయ్ కతియావాడి సినిమాకు గానూ అలియా భట్, మిమి సినిమాకు గానూ కృతి సనన్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. అయితే ఈ రెండు సినిమాల సెలక్షన్ విషయంలో హీరోయిన్ల మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన గంగూభాయ్ కతియావాడి సినిమాలో వేశ్యపాత్రలో నటించారు అలియా. అంతేకాదు ఈ సినిమాలో తన వయసుకు మించిన రోల్‌లో ఓల్డ్ ఏజ్‌లుక్‌లోనూ కనిపించి ఆకట్టుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో ఇలాంటి రిస్క్ చేయటం సినిమా రిలీజ్ టైమ్‌లోనూ హాట్ టాపిక్ అయ్యింది.

గ్లామరస్ బ్యూటీ కృతి కూడా మిమి సినిమా కోసం చాలా పెద్ద రిస్కే చేశారు. కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో మదర్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. హీరోగా టాప్ లీగ్‌లోకి రాక ముందు కృతి చేసిన రిస్క్‌కు మంచి అప్లాజ్ వచ్చింది.

కెరీర్‌లో మంచి ఫేజ్‌లో ఉన్న టైమ్‌లో ఇద్దరు హీరోయిన్లు రిస్క్ తీసుకొని చేసిన సినిమాలకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఈ ఇన్‌స్పిరేషన్‌లో ముందు ముందు మరి కొంత మంది హీరోయిన్స్ ఇదే రిస్క్ చేసందుకు ధైర్యం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ జనాలు.




