- Telugu News Photo Gallery Cinema photos After the flop of Agent, Akhil Akkineni is taking precautions for his next film
Akhil Akkineni: ఏజెంట్ రిజల్ట్.. ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని వారసుడు..
ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్, నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ అఖిల్‌తో నెక్ట్స్ మూవీ చేయబోయే దర్శకుడు ఇతనే అంటూ చాలా పేర్లు తెర మీదకు వస్తున్నాయి. భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ అక్కినేని అభిమానులకే కాదు అఖిల్‌కు కూడా షాక్ ఇచ్చింది. ఈ సిసింద్రి ఎంతో కష్టపడి ఎంతో టైమ్ తీసుకొని చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది.
Updated on: Jan 18, 2024 | 5:46 PM

ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన అఖిల్, నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ అఖిల్‌తో నెక్ట్స్ మూవీ చేయబోయే దర్శకుడు ఇతనే అంటూ చాలా పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ అక్కినేని అభిమానులకే కాదు అఖిల్‌కు కూడా షాక్ ఇచ్చింది. ఈ సిసింద్రి ఎంతో కష్టపడి ఎంతో టైమ్ తీసుకొని చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో డైలమాలో పడ్డారు అఖిల్.

అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఇతడే అంటూ గతంలోనే చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ఎలివేషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఈ దర్శకుడితో అఖిల్ సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది.

ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, నారప్ప లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల, అఖిల్ హీరోగా ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా వైరల్ అయ్యింది. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు.

తాజాగా ఈ లిస్ట్‌లో ఓ కొత్త దర్శకుడి పేరు వినిపిస్తోంది. రాధేశ్యామ్ సినిమాకు డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేసిన అనిల్ కుమార్ కెప్టెన్సీలో అఖిల్ నెక్ట్స్ మూవీ ఉండబోతుంది అన్నది నయా అప్‌డేట్. మరి ఈ లిస్ట్‌లో అఖిల్ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.




