- Telugu News Photo Gallery Cinema photos Will the heroes who have not seen hit for a long time give success with their next films?
Film News: చాలాకాలం హిట్స్ కి నోచుకోని హీరోలు.. తర్వాతి చిత్రాలైన వీరికి విజయాన్ని ఇస్తాయా.?
అంతా బాగానే ఉంది.. వాళ్లకు ఏమైంది? గతం గతః అనుకుని, నెక్స్ట్ అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారా? లేదా? ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలేంటి? వాటి మీద జనాలకు ఉన్న హోప్స్ ఏంటి? అంటూ రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి పిల్మ్ నగర్ జంక్షన్‌లో. ఇంతకీ జనాలు మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో తెలుసా? చూసేద్దాం రండి... హీరో నితిన్‌కి సరైన సక్సెస్ పడి చాన్నాళ్లయింది. హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని. నాగచైతన్యకు సిల్వర్‌స్క్రీన్ మీద పండగొచ్చి చాన్నాళ్లయింది.
Updated on: Jan 18, 2024 | 6:08 PM

అంతా బాగానే ఉంది.. వాళ్లకు ఏమైంది? గతం గతః అనుకుని, నెక్స్ట్ అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారా? లేదా? ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలేంటి? వాటి మీద జనాలకు ఉన్న హోప్స్ ఏంటి? అంటూ రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి పిల్మ్ నగర్ జంక్షన్‌లో. ఇంతకీ జనాలు మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో తెలుసా? చూసేద్దాం రండి...

హీరో నితిన్‌కి సరైన సక్సెస్ పడి చాన్నాళ్లయింది. ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్‌గా విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా అస్సాం పోయింది. అందుకే సిసలైన హిట్ కావాలంటున్నారు నితిన్. 2024లో అయినా నితిన్ కోరుకునే సక్సెస్ ఎక్స్ ట్రార్డినరీగా పలకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

నితిన్‌లాగానే హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఆ సినిమాతో మాస్‌లో జబర్దస్త్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆయనకు అనుకున్నంత సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్‌కి మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

నాగచైతన్యకు సిల్వర్‌స్క్రీన్ మీద పండగొచ్చి చాన్నాళ్లయింది. ఆ మధ్య చేసిన థాంక్యూ సరిగా ఆడలేదు. కస్టడీ కూడా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో అర్థం కాని పరిస్థితి. అందుకే ఇప్పుడు హోప్స్ అన్నీ తండేల్ మీద పెట్టుకున్నారు చైతన్య. తండేల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం చైతూ తీసుకుంటున్న కేర్ చూసి ముచ్చటపడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్

2023లో ఎవరూ ఊహించని విధంగా ఓటీటీ డెబ్యూ చేశారు చైతూ. ఆయన నటించిన ధూత వెబ్‌సీరీస్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. స్టైలిష్ జర్నలిస్టుగా, కరెప్టడ్ వ్యక్తిగా చాలా బాగా నటించారు నాగచైతన్య. చైతూ నటనలో మెచ్యూరిటీ కనిపించిందని క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందాయి.




