- Telugu News Photo Gallery Cinema photos Actress Sara Ali Khan Latest Photos Goes Viral In Social Media telugu cinema news
Sara Ali Khan: ఆ బ్రహ్మా మర్చిపోయి అందమంత నీకే ఇచ్చేశాడేమో.. ఇంద్రజ కూతురిని మించిపోయిన సారా..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Feb 23, 2023 | 2:07 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

1995 ఆగస్ట్ 12న ముంబైలో పటౌడీ కుటుంబంలో జన్మించింది సారా. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ దంపతుల కుమార్తె. 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేధార్ నాథ్ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది.

తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఉత్తమ మహిళా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అలాగే సారా అలీ ఖాన్ ఇంటర్నేషనల్ ఇండియలన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్ కూడా కైవసం చేసుకుంది.

ఆ తర్వాత డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింబా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు.

ఆ తర్వాత లవ్ ఆజ్ కల్, కూలి నంబర్ 1 చిత్రాల్లో నటించింది. 2021లో ధనుష్ నటించిన ఆత్రాంగి రే చిత్రంలో నటించి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సారా బొద్దుగా ఉండేది. నటనపై ఆసక్తితో తనను తాను మార్చుకుని.. ప్రస్తుతం సన్నజాజి తీగ సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తుంది.

సారా ఫిట్ నెస్.. వర్కవుట్స్.. డైట్ పై ఫుల్ శ్రద్ద తీసుకుంటుంది. అలాగే తన ఫాలోవర్లకు సైతం ఫిట్ నెస్ సలహాలు, సూచనలు ఇస్తుంటుంది.

ఆ బ్రహ్మా మర్చిపోయి అందమంత నీకే ఇచ్చేశాడేమో.. ఇంద్రజ కూతురిని మించిపోయిన సారా..

ఆ బ్రహ్మా మర్చిపోయి అందమంత నీకే ఇచ్చేశాడేమో.. ఇంద్రజ కూతురిని మించిపోయిన సారా..




