- Telugu News Photo Gallery Cinema photos Actress Rashmika Mandanna Interesting Comments On Vijay Devarakonda In Her Recent Interview,
Rashmika Mandanna: విజయ్‌ను చూసి చాలా భయపడ్డాను.. రౌడీ బాయ్ గురించి రష్మిక క్రేజీ కామెంట్స్
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్, రష్మిక తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ రష్మిక కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఓటీటీలో, టీవీలో చూసిన ప్రేక్షకులు సినిమా బాగుంది అని ఫీల్ అయ్యారు.
Updated on: Jul 28, 2024 | 2:28 PM

టాలీవుడ్ లో క్రేజీ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక. ఈ జంట స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. విజయ్ , రష్మిక కలిసి గీతగోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్, రష్మిక తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ రష్మిక కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు.

ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఓటీటీలో, టీవీలో చూసిన ప్రేక్షకులు సినిమా బాగుంది అని ఫీల్ అయ్యారు. విజయ్ కూడా ఈసినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్ధం కావడంలేదు అని ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు. ఇక విజయ్ రష్మిక విషయానికొస్తే ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరూ వెకేషన్స్ కు వెళ్తున్నారంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కొత్త వారితో మాట్లాడాలంటే కాస్త భయం, బెరుకు అని తెలిపింది. అందుకే గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో మాట్లాడాలంటే చాలా భయపడ్డాను అని తెలిపింది రష్మిక.

మొదటి సారి విజయ్ ను కలిసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ విజయ్ చాలా కూల్. అతను సెట్ లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. ఆ వాతావరణం మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది. అందుకే షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. అందుకే ఆ సినిమా షూటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది అని చెప్పుకొచ్చింది రష్మిక.

ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. పుష్ప 2 సినిమాతో పాటు, తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. ఇక విజయ్ కూడా మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు.




