Tripti Dimri: ఆ విషయాలపై నాకు అసలు అవగాహనే లేదు.. యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ. యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.