- Telugu News Photo Gallery Cinema photos Actress Poorna gets emotional on body shaming and her Post delivery women physique Comments Telugu Heroines Photos
Poorna(Shamna Kasim): ఆ సమయంలో అనరాని మాటలన్నారు.. పాపం ఏడ్చేసిన పూర్ణ.!
పోస్ట్ డెలివరీ మహిళల శరీరాకృతి ఎలా ఉంటుంది.? పూర్వంలా ఉండటం సాధ్యమేనా.? పర్ఫెక్ట్ వర్కవుట్లు చేసి, కొన్నాళ్లకు పాత షేప్‌లోకి వచ్చేసేవారు ఉంటారేమో.. నేను రాలేకపోయాను. ఆ సమయంలో నన్ను అనరాని మాటలన్నారు. వాళ్లంటున్నది నన్ను కాదు.. ఓ తల్లిని అనే భావనే ననన్ను ముందుకు నడిపింది అని గుర్తుచేసుకుంటున్నారు పూర్ణ. రీసెంట్ టైమ్స్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిన పనిలేదు.
Updated on: Sep 22, 2024 | 11:59 AM

పోస్ట్ డెలివరీ మహిళల శరీరాకృతి ఎలా ఉంటుంది.? పూర్వంలా ఉండటం సాధ్యమేనా.? పర్ఫెక్ట్ వర్కవుట్లు చేసి, కొన్నాళ్లకు పాత షేప్‌లోకి వచ్చేసేవారు ఉంటారేమో.. నేను రాలేకపోయాను. ఆ సమయంలో నన్ను అనరాని మాటలన్నారు.

వాళ్లంటున్నది నన్ను కాదు.. ఓ తల్లిని అనే భావనే ననన్ను ముందుకు నడిపింది అని గుర్తుచేసుకుంటున్నారు పూర్ణ. రీసెంట్ టైమ్స్ లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిన పనిలేదు.

దాసు బావా.. అంటూ స్క్రీన్ మీద పూర్ణ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు ఘట్టమనేని ఫ్యాన్స్.. అంతలా మెప్పించిన పూర్ణ, అంతకు ముందు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. బాగానే గుర్తుండిపోయారు.

మహేష్ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ చేయడం ఇదేం తొలిసారి కాదు. అంతకు ముందు కొరటాల సినిమాలోనూ రాములోరు వచ్చినారురో సాంగ్‌లో స్పెషల్‌గా స్టెప్పులేశారు ఈ బ్యూటీ. మహేష్ పోస్టర్లు చూస్తూ.. వావ్ ఏం హీరో అనుకున్న తనకు అలాంటి అవకాశం వస్తుందని కల్లో కూడా ఊహించలేదంటారు పూర్ణ.

మహేష్ సినిమా వల్ల తన కెరీర్‌కి కూడా చాలా ప్లస్ అయిందన్నది పూర్ణ చాలా సందర్భాల్లో చెప్పిన మాట. కుర్చీ మడతపెట్టి అవకాశం వచ్చినప్పుడు తన శరీరాకృతిని గుర్తుచేసుకుని, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని కూడా మదనపడ్డారట.

దానికి తగ్గట్టే తన పిక్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ట్రోల్స్ ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మిచ్చాక ఇలాంటి వాటికి కుంగిపోకూడదని సర్దిచెప్పుకున్నారట పూర్ణ.

అయినా, ఆ పాట రిలీజ్ అయ్యాక ఆ స్టెప్పులను అందరూ రీక్రియేట్ చేసి మెచ్చుకుంటుంటే, అంతకు ముందు విన్న విమర్శలు అసలు గుర్తుకురాలేదంటున్నారు ఈ కేరళ లేడీ.





























