Rajeev Rayala |
Updated on: Feb 07, 2024 | 9:30 PM
ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ పేరు మారుమ్రోగింది. తొలి సినిమాలోనే రెచ్చిపోయి నటించింది ఈ చిన్నది.
ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది పాయల్. అందాల ఆరబోతతో పాటు నటనతో ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా మంగళవారం సినిమాతో మరో హిట్ అందుకుంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పాయల్ తన నటనతో ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.