Rajeev Rayala |
Updated on: Dec 06, 2022 | 10:44 PM
90వ దశకంలో సినిమా లవర్స్ కు పరిచయం లేని పేరు లైలా..ఈ అమ్మడికి అప్పటిలో భారీ ఫాలోయింగ్ ఉంది. 2004 వరకు కూడా లైలా తన హవా కొనసాగించింది.
క్యూట్ లుక్స్.. అల్లరి చేష్టలతో లైలా అందరిని అలరించింది. ఆమె క్యూట్ లుక్స్ ని అభిమానులు ఎప్పటికి మరచిపోలేరు. వివాహం తర్వాత లైలా సినిమాలకు దూరం అయింది.
తెలుగులో లైలా శ్రీకాంత్ సరసన ఎగిరే పావురమా చిత్రంలో నటించింది. అలాగే బాలకృష్ణ సరసన పవిత్ర ప్రేమ చిత్రంలో కూడా లైలా మెరిసింది. వివాహం తర్వాత లైలా పూర్తిగా సినిమాలకు దూరం అయింది.
నవ్వే సమయంలో ఆమె కళ్లు మూసుకోవడం ఆమె ప్రత్యేకత. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ చేసినట్లుగా ఉండే లైల అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసింది.
అబ్బాయిల మనసు దోచుకుంది. ఇదిలా ఉండగా లైలా ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ ని ప్రారంభించింది. తమిళంలో సర్దార్ చిత్రంతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది లైలా. అలాగే తెలుగు ప్రేక్షకులని సైతం పలకరిస్తుంది.
అయితే ఈ సినిమలో లైలా మరింత గ్లామరస్ గా కనిపించడం తో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన లైలా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసిస్తున్నారు. రోజు రోజుకు ఈ అమ్మడికి అందం పెరిగిపోతుంది