Keerthy Suresh: మోడ్రన్ డ్రస్‌లో మతిపోగొడుతోన్న మహానటి.. కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్
తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గాతెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తన నటనతో కట్టిపడేసింది.
Updated on: Feb 29, 2024 | 8:39 PM

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గాతెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తన నటనతో కట్టిపడేసింది.

ఆతర్వాత కీర్తిసురేష్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ,వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయింది కీర్తిసురేష్. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. ఇటీవలే తెలుగులో నాని తో కలిసి దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. రకరకాల ఫొటోలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ వయ్యారి. సోషల్ మీడియాలో కీర్తిసురేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా కీర్తిసురేష్ మోడ్రన్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. వైట్ కలర్ డ్రస్ లో వయ్యారాలు ఒలకబోసింది కీర్తిసురేష్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అడపాదడపా ఇలా ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది.