- Telugu News Photo Gallery Cinema photos Pan India Star Prabhas Next Movie plan with small Director Hanu Raghavapudi with Love story details here Telugu Heroes Photos
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేమలో పడ్డ ప్రభాస్.!
వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. ప్రభాస్‌ను చూసాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారిప్పుడు. నేను నటున్ని.. మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి.. నేను నటిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్. అందుకే ఈ హీరోతో ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఓ ప్రేమకథకు ఓకే చెప్పారు ప్రభాస్. ప్రభాస్‌లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు.
Updated on: Feb 29, 2024 | 7:19 PM

వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. ప్రభాస్‌ను చూసాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారిప్పుడు. నేను నటున్ని.. మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి.. నేను నటిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్.

వాడుకున్నోళ్లకు వాడుకున్నంత.. ప్రభాస్‌ను చూసాక దర్శకులు ఇదే మాట చెప్తున్నారిప్పుడు. నేను నటున్ని.. మీలో మీరు ఎలాంటి కథలైనా రాయండి.. నేను నటిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రెబల్ స్టార్.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా.. ఏ ఒక్క సినిమాకు మరో దానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు ప్రభాస్. గతేడాది ఆదిపురుష్ డివోషనల్ అయితే.. సలార్ పూర్తిగా మాస్ సినిమా.

దానికి ముందు రాధే శ్యామ్ లవ్ స్టోరీ.. సాహో పక్కా యాక్షన్ బొమ్మ. ఇలా ప్రతీదీ దేనికదే విభిన్నం. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్‌తో కూడిన టైమ్ ట్రావెల్ సినిమా చేస్తుంటే.. మారుతి మాత్రం ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్ వాడుకుంటున్నారు.

వీటి తర్వాత సలార్ 2 మాస్ ఎంటర్‌టైనర్ కాగా.. స్పిరిట్ పూర్తిగా సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో సాగే యాక్షన్ సినిమా. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగానే.. హను రాఘవపూడి కథకు కూడా ఓకే చెప్పారు ప్రభాస్.

ఇది రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని తెలుస్తుంది. సీతా రామంలో 1965 నేపథ్యం తీసుకున్న హను.. ప్రభాస్ కోసం మరో 25 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు.

ఇలా ప్రభాస్‌తో ఒక్కో దర్శకుడు ఒక్కో డిఫెరెంట్ జోనర్‌లో సినిమా చేస్తున్నారు. అందుకే ఆయన కూడా ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు.




