- Telugu News Photo Gallery Cinema photos Actress Katrina Kaif Next Movies and new updates details here Telugu Actress Photos
Katrina Kaif: ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌కే పరిమితమైన కత్రినా.. ఈసారి విశ్వరూపమే..
హీరోయిన్ అంటే నాలుగు సీన్లు నాలుగు పాటలుకే పరిమితం అన్నది పాత మాట. ప్రజెంట్ హీరోయిన్లు కూడా కథలో భాగమవుతున్నారు. అవసరమైతే యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. హీరోల రేంజ్‌లో రిస్కీ స్టంట్స్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు బ్యూటీస్. గ్లామర్ క్వీన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు యాక్షన్ స్టార్‌గా ప్రూవ్ చేసుకుంటున్న బ్యూటీ కత్రినా కైఫ్.
Updated on: Oct 12, 2023 | 6:29 PM

హీరోయిన్ అంటే నాలుగు సీన్లు నాలుగు పాటలుకే పరిమితం అన్నది పాత మాట. ప్రజెంట్ హీరోయిన్లు కూడా కథలో భాగమవుతున్నారు. అవసరమైతే యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

హీరోల రేంజ్‌లో రిస్కీ స్టంట్స్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు బ్యూటీస్. గ్లామర్ క్వీన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు యాక్షన్ స్టార్‌గా ప్రూవ్ చేసుకుంటున్న బ్యూటీ కత్రినా కైఫ్.

కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా రొటీన్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ మాత్రమే చేసిన క్యాట్, ఇప్పుడు మాత్రం యాక్షన్ ఇమేజ్ మీద ఫోకస్ పెంచారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ సిరీస్‌లో యాక్షన్ రోల్స్ కోసం గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు కత్రినా.

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న టైగర్ 3లో మరోసారి యాక్షన్ అవతార్‌లో కనిపించేందుకు చాలా కష్టపడ్డారు.ఏక్తా టైగర్ సినిమాలో పాకిస్థాన్ ఏజెంట్‌గా కనిపించిన కత్రినా... ఆ సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్‌కే పరిమితమయ్యారు.

కానీ టైగర్ జిందాహైలో మాత్రం యాక్షన్ విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో సల్మాన్‌తో పాటు ఫైట్ చేసి వావ్ అనిపించారు. ఫిట్‌నెస్ విషయంలోనూ హాలీవుడ్ యాక్షన్ బ్యూటీస్‌ను గుర్తు చేశారు. టైగర్ 3 తన కెరీర్‌లోనే టఫ్ మూవీ అంటున్నారు క్యాట్.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండాలని ముందే ఫిక్స్ అయిన మేకర్స్, హాలీవుడ్ రేంజ్ స్టంట్స్‌ను డిజైన్ చేశారు. ఆ సీన్స్ కోసం ఫిజికల్‌గా తాను ఎంతో స్ట్రెయిన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు కత్రినా.

అయితే తెర మీద ఆ సీన్స్ చూశాక పడ్డ కష్టమంతా మర్చిపోయామని, ఆడియన్స్ కూడా థియేటర్స్‌లో థ్రిల్ ఫీల్ అవుతారని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.




