Rashmika Mandanna: మంచి రోజులొచ్చాయ్.. ఇప్పుడు నా టైమ్ నడుస్తోందంటోన్న రష్మిక.. ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మంధాన. ప్రస్తుతం ఆమె దక్షిణాది సినిమాలతో పాటు హిందీ మూవీస్‌లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.
Updated on: Oct 12, 2023 | 2:12 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మంధాన. ప్రస్తుతం ఆమె దక్షిణాది సినిమాలతో పాటు హిందీ మూవీస్‌లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.

అయితే కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో రష్మికకు వరుసగా అపజయాలే ఎదురవుతున్నాయి. కోలీవుడ్‌లో రష్మిక ఎంట్రీ ఇచ్చిన కార్తీ సుల్తాన్ పెద్దగా ఆడలేదు. విజయ్ దళపతి వారసుడులో కూడా తన నటనకు స్కోప్ లేకుండా పోయింది.

ఇక బాలీవుడ్‌లో తను నటించిన మిషన్ మజ్ఞు, గుడ్ బై సినిమాలకు మంచి పేరొచ్చినా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇక పుష్ప తర్వాత తెలుగులో రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడిప్పుడే తన టైమ్ బాగుంటోందంటోంది నేషనల్ క్రష్.

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో మంచి టైమ్ వస్తుందని, అలా తనకిప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయని రష్మిక చెప్పింది. తనకు మంచి పాత్రలు వస్తుండడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది.

కాగా రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది. అలాగే పుష్ప 2, రెయిన్ బో సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.