- Telugu News Photo Gallery Cinema photos Actress Arundhathi Nair in critical condition after Horrifying Bike Accident telugu cinema news
Arundhathi Nair: ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన హీరోయిన్.. పరిస్థితి విషమం..
మలయాళీ సినీ నటి అరుంధతీ కేరళలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. అరుంధతీ సోదరి ఆర్తి వెల్లడించింది. మూడు రోజులుగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కేరళ, తమిల మీడియాల్లో మారుమోగుతుండగా.. ఈరోజు ఆమె సోదరి ఆర్తి స్పందించింది.
Updated on: Mar 19, 2024 | 5:54 PM

మలయాళీ సినీ నటి అరుంధతీ కేరళలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. అరుంధతీ సోదరి ఆర్తి వెల్లడించింది. మూడు రోజులుగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కేరళ, తమిల మీడియాల్లో మారుమోగుతుండగా.. ఈరోజు ఆమె సోదరి ఆర్తి స్పందించింది.

ప్రస్తుతం అరుంధతీ పరిస్థితి విషమంగా ఉందని.. ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని.. గత మూడు రోజులుగా తీవ్రగాయాలతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుంధతీకి చికిత్స జరుగుతుందని సోషల్ మీడియాలో నోట్ షేర్ చేసింది. తన సోదరి కోసం ప్రార్థించాలంటూ అభిమానులను కోరింది ఆర్తి. దీంతో అరుంధతీ త్వరగా కోరుకోవాలని ఆమె ఫ్యాన్స్ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

"గత మూడు రోజులుగా తమిళనాడు, కేరళలో వస్తునన వార్తలపై మేము స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాము. నా సోదరి అరుంధతీ నాయర్ కు మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగిన మాట వాస్తవమే.ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆమె త్రివేండ్రంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం తను ప్రాణాల కోసం పోరాడుతుంది. నా సోదరి వేగంగా కోలుకోవడానికి మీరు ప్రార్ధించండి.. మాకు మీ ప్రేమ, సపోర్ట్ కావాలి" అంటూ ఆర్తి పోస్ట్ చేశారు. దీంతో ఆమె కోలుకోవాలని.. అరుంధతీ కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మూడు రోజుల క్రితం అరుంధతీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. కోవలం బైపాస్ వద్ద వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుంధతి తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.

అరుంధతి నాయర్ 2014లో తమిళ చిత్రం పొంగి ఎజు మనోహరతో అరంగేట్రం చేసింది. విజయ్ ఆంటోని సైతాన్‌లో నటించిన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించింది.




