- Telugu News Photo Gallery Cinema photos A recent photo from Pawan Kalyan OG movie shake the social media
Pawan Kalyan: ఆయన బ్యాక్ సైడ్ ఫోటో చాలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తాం..
ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో.. అందులో కనీసం మొహం కూడా చూపించలేదు.. బ్యాక్ సైడ్ నుంచి అలా నడిచెళ్తున్న ఫోటో.. దానికే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు OG విషయంలో సుజీత్ ఏం చేస్తున్నారు..? మిగిలిన సినిమాలపై కూడా బజ్ ఉంది.. కానీ వాటిని మించిన బజ్ OGలోనే ఎందుకు కనిపిస్తుంది..? ఇదంతా ఒరిజినల్ కంటెంట్‌కు ఉన్న మహిమేనా..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Feb 17, 2024 | 3:22 PM

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలా ఉన్నా.. అక్కడెలాంటి విమర్శలు వచ్చినా.. సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఈయన కింగ్ అంతే. ఒక్క అప్‌డేట్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.

OGకి ఇదే జరుగుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ సినిమాల వైపు రానున్నారు పవన్. ఈ లోపు ప్రమోషన్స్ ఎక్కడా ఆపట్లేదు ఓజి టీమ్.

పంజా తర్వాత పవన్ చేస్తున్న ఆల్ట్రా మోడ్రన్ స్టైలిష్ యాక్షన్ సినిమా OGనే. పవర్ స్టార్‌లోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌ను ఓజిలో చూపిస్తున్నారు సుజీత్. మిగిలిన దర్శకులతో పోలిస్తే సుజీత్ పక్కా ప్లానింగ్‌తో తన సినిమా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే OG షూటింగ్ 70 శాతం పూర్తైంది. తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో సుజీత్ భుజంపై చేయి వేసి నడుస్తున్నారు పవన్.

సుజీత్, పవన్ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్. ఒక్క ఫోటోకే ఈ క్రేజ్ ఉంటే.. రేపు సినిమా వచ్చాక ఎలా ఉంటుందో..? పవన్ మరో 15 రోజులు ఇస్తే ఓజి పూర్తైపోతుంది. జూన్ ఫస్ట్ వీక్‌లో డేట్స్ అడ్జస్ట్ చేయాలని చూస్తున్నారు పవన్.

సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉన్నా.. మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ ఆపట్లేదు. ఇది కూడా వాళ్ల స్ట్రాటజీ ఏమో మరి..?





























