- Telugu News Photo Gallery Can you put a lamp at the Tulsi tree on Sunday? check here is details in Telugu
Spirituality Tips: ఆదివారం తులిసి చెట్టు వద్ద దీపం పెట్టొచ్చా? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు?
హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చేస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతే కాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అదే విధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా..
Updated on: Jan 21, 2024 | 9:53 PM

హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చేస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతే కాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు.

అదే విధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. తులసితో ఒక్కటేంటి.. చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో, రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు.. ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు చూద్దాం.

కొన్ని గ్రంథాల ప్రకారం.. ఆదివారం తులసమ్మ.. శ్రీ మహా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు. నీరు పోసి, దీపారాదన చేస్తే.. ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని.. ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు.

అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. అదే విధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని, విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు. అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్దం.




