''మనం ఏం చేసినా చుట్టూ ఉన్నవాళ్లు పొగుడుతుంటే ఎదుగుదల ఉండదు. ఉన్నదున్నట్టు చెప్పే వాళ్లే కావాలి మనకు. మా అమ్మా నాన్న, నా హెయిర్ డ్రస్సర్, మేకప్ ఆర్టిస్ట్ కూడా నాతో నిజాలే చెబుతారు. వాళ్లకు నచ్చకపోతే, నాతో చెప్పడానికి ఏమాత్రం మొహమాటపడరు. నేను పదే పదే వెళ్లి మానిటర్ చూసుకోను. సెట్లో సీన్ పూర్తయ్యాక వెళ్లి డైరక్టర్‌ని కలుస్తాను. వాళ్లకి ఓకే అంటే నాక్కూడా ఓకే. సినిమా పూర్తయ్యాక స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏవో తప్పులు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని సరిచేసుకోవాలని భావిస్తా. ఎందుకంటే, నా మెరుగైన పనితీరు, భవిష్యత్తులో నాకు మరిన్ని ప్రాజెక్టులు తెచ్చిపెడుతుందని నమ్ముతాను.''