- Telugu News Photo Gallery Business photos These are the most popular bikes in India.. Available at a budget price..!
Budget Bikes: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లు ఇవే.. బడ్జెట్ ధరలోనే అందుబాటులో..!
భారతదేశంలో రెండు దశాబ్దాలుగా ద్విచక్ర వాహన వినియోగం పెరిగింది. తగ్గుతున్న రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రాంతాల్లో కూడా ద్విచక్ర వాహనం తప్పనిసరైంది. అయితే భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ కాబట్టి బడ్జెట్‌లో దొరికే ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎక్కువైంది. కాబట్టి భారతదేశంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌ల వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
Srinu | Edited By: Ravi Kiran
Updated on: Oct 24, 2023 | 8:00 PM

హీరో స్ప్లెండర్ ప్లస్ ముప్పై ఏళ్ల క్రితం భారతదేశంలో విడుదలైంది. ద్విచక్ర వాహన రంగంలో ఈ బైక్ ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది. ఈ బైక్ ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ ద్విచక్ర వాహనంగా ఉంది. ఈ బైక్ 97.22 సీసీ ఎయిర్ కూల్డ్ సిలిండర్ ఇంజిన్, 7.91 బీహెచ్‌పీ పీక్ పవర్, 8.05 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సుమారు లీటర్‌కు 80 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.75,141 నుంచి రూ.79,986 వరకూ ఉంటుంది.

హోండా షైన్ 125 బైక్ గత కొన్నేళ్లుగా భారతీయులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఎంట్రీ లెవెల్ కంటే కొంచెం ఎక్కువ పవర్‌తో బైక్ కావాలనుకునే ఈ బైక్ మంచి ఎంపిక. 123.94 సీసీ ఇంజిన్‌తో వచ్చ ఈ బైక్ 10.59 బీహెచ్‌పీ అధిక శక్తిని 11 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర రూ.73,800 నుంచి రూ.83,800 మధ్య ఉంటుంది.

హోండా ఎస్‌పీ 125 బైక్ రూ.86,017 నుంచి రూ.90,071 (ఎక్స్‌షోరూమ్) మధ ఉంటుంది. రూ.లక్ష లోపు మంచి బైక్ కావాలనుకునే వారికి ఈ బైక్ మంచి ఎంపికగా ఉంటుంది. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం కోట్‌ను పెంచే ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌తో వస్తుంది. ఈ మోటర్ బైక్ ఐదు గేర్‌లతో జత చేసిన 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. 10.72 బీహెచ్‌పీ గరిష్ట శక్తితో పాటు 10.9 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ముఖ్యంగా షైన్ 125తో పోలిస్తే ధర వ్యత్యాసం కూడా పెద్దగా లేదు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ భారతదేశంతో పాటు విదేశాల్లో ఆదరణ పొందింది. ఐ3ఎస్ టెక్నాలజీతో వచ్చే ఈ బైక్ తొమ్మిది శాతం అధికంగా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. 97.2 సీసీ సింగిల్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ నాలుగు-స్పీడ్ గేర్ బాక్స్‌లతో జత చేశారు. ఈ ఇంజిన్ 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర కూ రూ.59,998 నుంచి రూ.68,786 మధ్య ఉంటుంది.

హీరో గ్లామర్ బైక్ 125 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ.80,908 నుంచి రూ.86,348 మధ్య వస్తుంది. ఈ బైక్ డిజిటల్ ఇన్సుట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ పోర్ట్, 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పని చేస్తుంది. ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్‌తో 10.39 బీహెచ్‌పీ శక్తి పొందుతుంది. 10.4 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 6.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.





























