మారుతి సుజుకి స్విఫ్ట్.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఇంధన సామర్థ్యం, లుక్స్, స్తోమత, అధిక-రీసేల్ విలువ స్విఫ్ట్‌ను దేశంలోని ప్రముఖ మోడల్‌లలో ఒకటిగా మార్చింది. అదే సమయంలో అత్యధికంగా దొంగతనానికి గురైన కారు కూడా ఇదే. ఈ కారులో 1.2 లీటర్, 4 సిలెండర్ ఎఏ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో ఉంటుంది. దీని ధరలు రూ. 5.99లక్షల నుంచి రూ. 9.04లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.