- Telugu News Photo Gallery Business photos Indian Railways confirm train ticket journey date change without canceled know process
Indian Railways: మీరు రైలు టికెట్‌ను రద్దు చేసుకోకుండానే ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.. ఎలాగంటే..
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది. రైలులో ప్రయాణించాలంటే ముందుగా టికెట్స్ బుకింగ్ చేసుకుంటాము. అయితే కొన్ని సందర్భాలలో టికెట్ బుకింగ్ అయిన తర్వాత ప్రయాణ..
Updated on: Jun 03, 2023 | 4:27 PM

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది.

రైలులో ప్రయాణించాలంటే ముందుగా టికెట్స్ బుకింగ్ చేసుకుంటాము. అయితే కొన్ని సందర్భాలలో టికెట్ బుకింగ్ అయిన తర్వాత ప్రయాణ సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రయాణ తేదీ మార్చుకుంటారు. అలాంటి పరిస్థితిలో టికెట్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే మీరు టికెట్స్‌ను రద్దు చేయకుండానే రైలు ప్రయాణ సమయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ధృవీకరించబడిన టిక్కెట్‌పై మీ ప్రయాణ తేదీని మార్చడానికి మీరు రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్‌లో మీ టిక్కెట్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది.

అలాగే కొత్త తేదీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మీరు తరగతిని అప్‌గ్రేడ్ చేసే ఆప్షన్‌ను కూడా పొందుతారు. దరఖాస్తును స్వీకరించిన తర్వాత మీ ప్రయాణ తేదీ, తరగతి రెండూ కూడా మారుతాయి.

తేదీని మార్చినందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు తరగతిని మార్చినట్లయితే, ఆ తరగతి ఛార్జీల ఆధారంగా డబ్బు వసూలు చేస్తుంది రైల్వే.

ఈ సులభమైన మార్గంలో మీరు ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. అలాగే ఎలాంటి సమస్య ఎదుర్కొకుండా మీ ప్రయాణాన్ని సులభంగా చేసుకోవచ్చు.





























