- Telugu News Photo Gallery Business photos Get Up To Rs 33,000 Off On Maruti Suzuki Cars This January
Maruti Suzuki Cars: కారు కొనుగోలు చేసేవారికి మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఈ కార్లపై రూ.33,000 వరకు డిస్కౌంట్
Maruti Suzuki Cars:మారుతి సుజుకీ ఈ జనవరిలో పలు మోడళ్ల కార్లపై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ డిజైన్, విటారా బ్రెజ్జాపై బారరీ తగ్గింపు అవకాశం కల్పిస్తోంది మారుతి సుజుకీ. అలాగే ఎక్చైంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పలు మోడళ్లపై డిస్కౌంట్ భారీగా ఉంది. ..
Updated on: Jan 11, 2022 | 12:43 PM

మారుతి ఆల్టో (Maruti Alto): మారుతి ఆల్టో పై రూ.33వేల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ కారు మొత్తంపై నగదు తగ్గింపు రూ.15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000 వరకు అందిస్తోంది. మొత్తం రూ.33,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. దీని ధర రూ.3.78 లక్షల నుంచి రూ.5.43 లక్షల వరకకు ఉంది. ఈ మారుతి ఆల్టో ధర రూ.3.15 లక్షల నుంచి రూ.4.82 లక్షల వరకు ఉంది.

మారుతి సెలెరియా (Maruti Celerio): దీని ధర మొత్తంపై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం రూ.13,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని అసలు ధరర రూ.4.99 లక్షల నుంచి రూ.6.44 లక్షల వరకు ఉంది.

మారుతి ఈకో (Maruti Eeco): మారుతి ఈకో ధరపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం 23,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ.4.38 లక్షల నుంచి రూ.7.37 లక్షల వరకు ఉంది.

మారుతీ సుజుకి S-ప్రెస్సో (S-Presso): ఈ మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో ధర మొత్తంపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000, మొత్తం రూ.23,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.

మారుతీ వ్యాగన్ ఆర్ (Maruti Wagon R): దీనిపై మొత్తంపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000, ఆఫర్‌లో మొత్తం తగ్గింపు రూ.23,000 వరకు పొందవచ్చు. దీని ధర రూ.6.45 లక్షల నుంచి రూ.4.93 లక్షల వరకు ఉంది.

మారుతి స్విఫ్ట్/ డిజైన్ (Maruti Swift/Dzire): దీని ధరపై నగదు తగ్గింపు రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం తగ్గింపు రూ.23,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని అన్ని వేరియంట్లపై ఈ తగ్గింపు పొందవచ్చు. స్విఫ్ట్ అసలు ధర రూ.5.85 లక్షల నుంచి రూ.8.53 లక్షల వరకు ఉంది. డిజైర్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.08 లక్షల వరకు ఉంది.

మారుతి విటారా బ్రెజ్జా (Maruti Vitara Brezza): దీని ధర మొత్తంపై నగదు తగ్గింపు రూ.5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000, కార్పొరేట్ తగ్గింపు రూ.3,000. మొత్తం రూ.18,000 వరకు తగ్గింపు ప్రయోజనం ఉంటుంది. దీని ధర రూ.7.62 లక్షల నుంచి రూ.11.11 లక్షల వకకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆఫర్ల ధరల్లో ఆయా రాష్ట్రాల బట్టి మారుతూ ఉంటాయి.




