- Telugu News Photo Gallery Business photos Best business ideas with low investment and get high profits
Business Idea: పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ.. ఈ బిజినెస్‌తో తిరుగే ఉండదు
ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగంలో ఎంత డబ్బు సంపాదించినా సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో ఉంటారు. అయితే లాభాలు రావని, పెట్టుబడికి భయపడో ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు. అయితే అలా కాకుండా తక్కువ బడ్జెట్‌తో మంచి లాభాలు పొందే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 23, 2024 | 2:54 PM

మేకప్ ఆర్టిస్టులకు కూడా ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే మేకప్ వేసుకోవడానికి ఆసక్తిచూపే వారు. ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మేకప్ వేసుకుంటారు. దీంతో ఇలాంటి వారికి మంచి లాభాలు వస్తున్నాయి. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి అసవరం లేదు. మేకప్ ఆర్టిస్టుల నుంచి మంచి శిక్షణ తీసుకొని సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు.

పచ్చళ్ల వ్యాపారం కూడా మంచి బిజినెస్ ఐడియాగా చెప్పొచ్చు. ప్రస్తుతం బిజీగా మారిన జీవనశైలి నేపథ్యంలో చాలా మంది ఇన్‌స్టాంట్‌గా దొరికే పచ్చళ్లను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమ్మర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు లభించే మామిడికాయలతో రకరాల పచ్చళ్లను తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు.

ఇక టీ స్టాల్ కూడా మంచి బిజినెస్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రజలు ఎక్కువగా ఉండే చోట టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. అలాగే కాలంతో సంబంధం లేకుండా నడిచే ఈ వ్యాపారంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

ఫుడ్ బిజినెస్ ఎవర్ గ్రీన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. మరీ ముఖ్యంగా టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. మంచి సెంటర్‌ను చూసుకొని టిఫిన్ సెంటర్‌ను ప్రారంభిస్తే సరిపోతుంది. టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి హోటల్ గది అద్దె కాకుండా ఒక రూ. 10 వేలతో టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డబ్బులు ఆర్జిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం మీ ప్రతిభతోనే డబ్బు సంపాదించుకునే అవకాశం దీంతో ఉంది. ఇన్ఫర్మేటివ్, ఫుడ్, ట్రావెల్‌కు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందొచ్చు.




