- Telugu News Photo Gallery Apple to employ 5 lakh people in India over next 3 years by scaling up production: Report
Apple: భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!
భారతదేశంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. అమెరికాకు చెందిన ప్రముఖ ఐఫోన్ తయారీ కంపెనీ భారత్ లో భారీ స్థాయిలో వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే మూడేళ్లలో యాపిల్ కంపెనీ భారత్‌లో ఐదు లక్షల మందికిపైగా ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ విక్రేతలు, సరఫరాదారులు భారతదేశంలో 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆపిల్ కోసం రెండు ప్లాంట్లను నడుపుతున్న..
Updated on: Apr 22, 2024 | 9:46 PM

భారతదేశంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. అమెరికాకు చెందిన ప్రముఖ ఐఫోన్ తయారీ కంపెనీ భారత్ లో భారీ స్థాయిలో వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే మూడేళ్లలో యాపిల్ కంపెనీ భారత్‌లో ఐదు లక్షల మందికిపైగా ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యాపిల్ విక్రేతలు, సరఫరాదారులు భారతదేశంలో 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆపిల్ కోసం రెండు ప్లాంట్లను నడుపుతున్న టాటా ఎలక్ట్రానిక్స్ అత్యధిక ఉపాధిని అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి నుంచి ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ చైనాకు దూరమై భారత్‌లో పెట్టుబడులు పెడుతోంది.

ఇప్పుడు కంపెనీ తన సరఫరాలో సగభాగాన్ని సమీప భవిష్యత్తులో చైనా నుండి భారతదేశానికి మారుస్తుంది. ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అయితే యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తిని దాదాపు 5 రెట్లు పెంచాలని యోచిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో భారతదేశంలో తమ ఉత్పత్తిని దాదాపు 40 బిలియన్ డాలర్లకు (రూ. 3.32 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది.

ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలంటే ఆపిల్ చాలా ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆపిల్ చైనాలో దాని తయారీ స్థావరం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంది. దీని తర్వాత కంపెనీ భారత్‌పై దృష్టి సారించింది.

2023లో యాపిల్ భారత్ నుంచి అత్యధిక ఆదాయాన్ని పొందుతుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. అయితే అమ్మకాల పరంగా శాంసంగ్ విజయం సాధించింది. యాపిల్ భారత్ నుంచి దాదాపు కోటి ఫోన్లను ఎగుమతి చేసింది. అలాగే రెవెన్యూ పరంగా దేశంలోనే తొలిసారిగా నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. 2023-24లో ఐఫోన్ ఎగుమతుల ద్వారా యాపిల్ భారతదేశం నుండి $12.1 బిలియన్లను సంపాదించింది. 2022-23 సంవత్సరంలో ఈ సంఖ్య 6.27 బిలియన్ డాలర్లుఇది దాదాపు 100 శాతానికి చేరింది.




