Vontimitta: పౌర్ణమి వెన్నెల్లో సీతమ్మను పెళ్లి చేసుకున్న రామయ్య.. ఇద్దరు దొంగలు కట్టిన కళా ఖండం చరిత్ర తెలుసా..

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఈరోజు 22వ తారీకు రాత్రి నిండు పౌర్ణమి నాడు పండు వెన్నెలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సెక్రటరీ కరికాల వల్లవన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 26వ తారీకు పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించారు.

Sudhir Chappidi

| Edited By: Surya Kala

Updated on: Apr 22, 2024 | 9:34 PM

ఒంటిమిట్ట దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు కళ్యాణ ప్రాంగణానికి చేరుకొని సాయంత్రం ఆరున్నర గంటల నుంచి 8:30 గంటల వరకు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అధికారులు ముందుగానే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ట్రాఫిక్ ను మళ్ళించారు. కౌంటర్లను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ లడ్డు ప్రసాదం కళ్యాణ తలంబ్రాలను అందజేశారు.

1 / 7
వందల ఏళ్ళనాటి చరిత్ర ఇద్దురు దొంగలు కట్టిన ఒక అపూర్వ కళా ఖంఢం.. ఆంజనేయ స్వామి లేని ఏకైక ఆలయం . ఒకే రాతిపై రామలక్ష్మణులు సీతా దేవి ని చెక్కబడిన ఏకశిలా నగరం . ఒంటిమిట్ట శ్రీ కోదండరాములవారి దేవాలయం చెబుతుంటేనే ఎంతో ముచ్చటగా వినాలనిపిస్తున్న పురాతన చరిత్ర .. రాములవారి కల్యాణం అన్నిచోట్లా నవమిరోజే జరిగితే ఇక్కడ మాత్రం చతుర్దశి నాట పున్నమి వెన్నెలలో అంగరంఘ వైభవంగా జరుగుతుంది. ఇది దీని ప్రతీక. దక్షిణ భారత దేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కోదండరామస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర వుంది. ఆదిశేషుని తలభాగంగా తిరుమల మధ్య భాగంగా దేవుని కడప, ఒంటిమిట్ట, అహోభిలం ఉండగా తోకభాగంలో శ్రీశైలం ఉన్నాయంటారు. అటు తిరుమలకు ఇటు శ్రీశైలంకు మధ్య భాగంలో ఉండడం వల్ల దీనికి శ్రీరామ దొంటిమిట్టగా కూడా చెబుతుంటారు. దేవుని కడపను దర్శించుకుని తిరుమలకు వెళ్ళే  ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించడం పుణ్య ప్రధంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని మూడు ధఫాలుగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా 
తెలుస్తోంది.

వందల ఏళ్ళనాటి చరిత్ర ఇద్దురు దొంగలు కట్టిన ఒక అపూర్వ కళా ఖంఢం.. ఆంజనేయ స్వామి లేని ఏకైక ఆలయం . ఒకే రాతిపై రామలక్ష్మణులు సీతా దేవి ని చెక్కబడిన ఏకశిలా నగరం . ఒంటిమిట్ట శ్రీ కోదండరాములవారి దేవాలయం చెబుతుంటేనే ఎంతో ముచ్చటగా వినాలనిపిస్తున్న పురాతన చరిత్ర .. రాములవారి కల్యాణం అన్నిచోట్లా నవమిరోజే జరిగితే ఇక్కడ మాత్రం చతుర్దశి నాట పున్నమి వెన్నెలలో అంగరంఘ వైభవంగా జరుగుతుంది. ఇది దీని ప్రతీక. దక్షిణ భారత దేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కోదండరామస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర వుంది. ఆదిశేషుని తలభాగంగా తిరుమల మధ్య భాగంగా దేవుని కడప, ఒంటిమిట్ట, అహోభిలం ఉండగా తోకభాగంలో శ్రీశైలం ఉన్నాయంటారు. అటు తిరుమలకు ఇటు శ్రీశైలంకు మధ్య భాగంలో ఉండడం వల్ల దీనికి శ్రీరామ దొంటిమిట్టగా కూడా చెబుతుంటారు. దేవుని కడపను దర్శించుకుని తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించడం పుణ్య ప్రధంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని మూడు ధఫాలుగా నిర్మించినట్లు దేవస్థాన శాసనాల ద్వారా తెలుస్తోంది.

2 / 7
గాలిగోపురానికి ఆనుకుని దేవాలయ ఆవరణలో రెండు శిలా శాసనాలు వున్నాయి. మొదటి శిలాశాసనాన్ని 1555లో వేయగా కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి 1558లో రెండవ శిలశాసనాన్ని వేయించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. విశిష్టమైన శిల్పసంపద, విశాలమైన మండపాలు ఎత్తైన గాలిగోపురాలు, విజయనగరరాజుల శిల్పనైపుణ్యం తెలిపే ఆనవాళ్లు ఈ ఆలయంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఆలయ ముఖ మండపంలో 11వ శతాబ్దం నాటి శిల్పకళ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిని బట్టి ఈఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దానికి పూర్తయినట్లు తెలుస్తోంది. మట్లిరాజులు , చోళులు, విజయనగర రాజులు, శిల్పకళానైపుణ్యం అబ్బురపరుస్తుంది. ఆలయ ముఖమండపంలో రామాయమణం,భారతం, భాగవతం కథలను తెలిపే శిల్పాలు, వటపత్రసాయి బొమ్మలు, లంకకు వారధి నిర్మిస్తున్న వానరులు, సీతా దేవికి అంగుళీయానం చూపిస్తున్న ఆంజనేయస్వామి తదితర శిల్పాలు భక్తులను కట్టిపడేస్తాయి.

3 / 7

160 అడుగుల ఎత్తైన గాలిగోపురం 32 స్థంభాలతో ముఖ మంటపం పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. త్రేతాయుగంలో ఈ ప్రాంత పరిసరాల్లో మునులు తపస్సులు చేసేవారని చరిత్ర చెబుతుంది. మృకుంద మహర్షి, శృంగి మహర్షి, యాగం నిర్వహిస్తుండగా రాక్షసులు యాగానికి ఆటకం కల్పించారని . అప్పుడు కోదండరాముడు యాగరక్షణకు కోదండము, అంబులపొది, పిడిబాకులతో వచ్చారని ప్రతీతి . అందువల్లే ఇక్కడ రాముడిని కోదండరాముడిగా పిలుస్తారని ప్రతీతి. అరణ్య వాసం సమయంలో ఈ ప్రాంతంలో సంచరించే సందర్భంలో వణ్యప్రాణులకు నీళ్లు లేవని సీతాదేవి రాముని దృష్టికి తెచ్చిందని దీంతో సీతకు దాహంగా వుందని గ్రహించి రాములవారు బాణం వేయగా రామతీర్థం, లక్ష్మణుడు బాణం వేయగా లక్ష్మణ తీర్థం ఏర్పడ్డాయని స్థల పురాణం చెబుతోంది. దేవస్థానంలోని సీతా రామా లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై ఉండడం వల్ల దీనికి ఏక శిలనగరంగా కూడా వ్యవహరిస్తారు.

4 / 7
ఇక్కడి విగ్రహాలను త్రేతాయుగంలో స్వయంగా జాంబవంతుడిచే ప్రాణ ప్రతిష్ట చేసినట్లు శాసనాల ద్వార తెలుస్తోంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కనిపించకపోవడం ఓ ప్రత్యేకత. తర్వాత కొంతకాలానికి దేవాలయ ముఖ ద్వారానికి ఎదురుగా సంజీవరాయ స్వామి ఆలయం నిర్మించారు. ఆంజనేయస్వామి అంజలి ఘటించి స్వామి వారి సేవ చేస్తుండగా రాములవారి పాదాలు, ఆంజనేయస్వామి శిరస్సు సమానంగా ఉండేలా ఈ ఆలయం నిర్మించారు. రాముని ముందు ఆంజనేయస్వామి లేని ఎకైక రామాలయం ఒంటిమిట్టదే అని చెబుతారు. దేవస్థానానికి సంబందించి మరో జానపద కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటోడు, మిట్టోడు అనే ఇద్దరు అన్నదమ్ములు దొంగలుగా ఉండేవారని గ్రామాల్లో దోపిడీలు చేసి తెచ్చిన వస్తువులను గుహాల్లో దాచేవారని అప్పుడు గుహాలో ఏకశిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు వారికి హితోపదేశం చేయడంతో వారు రామ భక్తులుగా మారారన్న గాథ ప్రచారంలో వుంది. అందుకే ఈ గ్రామానికి ఒంటిమిట్టగా పేరు వచ్చిందని ప్రతీతి.

5 / 7
అయ్యలరాజు రామభధ్రుడు, బమ్మెర పోతనామాత్యుడు, తాళ్లపాక అన్నమాచార్యుడు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, వెంకటకవి, వరకవి, వావికొలను సుబ్బారువు, శ్రీభగవత్ రామానుజాచార్యులు తదితర ప్రముఖులు, ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. హిందూ మతంలో అన్ని కులాలు సమానమేనని అంటరానివారెవరూ లేరని కోదండరాముడు తెలిపినట్లు ఓ కథ కూడా ప్రచారంలో వుంది. భవనాసి మాల ఓబన్న అనే భక్తుడు దేవస్థాన ముఖద్వారం వద్ద కూర్చుని భజనలు చేస్తుండగా గ్రామపెద్దలు, పురోహితులు అతడని అంటరాని వాడిగా భావించి దేవస్థానం పడమటివైపు తోసివేశారు.  పూజారులు స్వామి వారికి పూజలు చేసేందుకు గర్భగుడి తలుపులు తెరవగా మూలవిరాట్ లు పడమటివైపు తిరిగి వున్నాయి. దీంతో అపరాధాన్ని గ్రహించి మాల ఓబన్నను తూర్పువైపు తీసుకువచ్చి భజనలు చేయగా మూలవిరాట్ లు యధాస్థానానికి చేరుకున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుంది.

6 / 7
1640లో కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా ఇమాంబేగ్ పనిచేసేవారు. సిద్దవటం కోటకు పోతూ ఒంటిమిట్ట చెరువులో గుర్రాలకు నీళ్లు త్రాగించి దేవాలయ పరిసరాలలో సేదతీరారు. మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ఇమాంబేగ్ అక్కడి వారిని ప్రశ్నిస్తాడు. త్రికరణ శుద్దితో పిలిస్తే పలుకుతాడని స్థానికులు సమాధానమిచ్చారు. అప్పుడు ఇమాంబేగ్ తలుపు దగ్గరకు పోయి ఓ రామా... రఘరామా కోదండరామా... అని పిలువగా ఓ ఓ ఓ  అనే సమాధానం వినిపించింది. దీంతో తన తప్పు తెలుసుకున్న ఇమాంబేగ్ స్వామి వారిని క్షమించమని వేడుకుని స్వామి వారి పూజకోసం నీటి అవసరాలు తీర్చడానికి దేవాలయ ఆగ్నేయ భాగంలో భావిని త్రవ్వించారు. ప్రతి శనివారం పలువురు ముస్లింలు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది.

7 / 7
Follow us
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..

పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే