- Telugu News Photo Gallery If You Have these health Issues Then Lemon Water Is Not For You, Expert Shares Why
Lemon Water: పరగడుపున నీమ్మ నీళ్లు తాగేవారికి అలర్ట్.. ఈ సమస్యలున్నవారు రోగాలు కొని తెచ్చుకున్నట్లే
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో నిమ్మకాయలు ముఖ్యమైనవి. వీటిల్లోని విటమిన్ సి రోగ నిరోధకతను పెంచడమే కాకుండా రకరకాల పోషకాలను శరీరానికి అందిస్తుంది. అయితే మీకు తెలుసా.. చాలా మంది ఉదయాన్నే నిమ్మనీరు తాగు తుంటారు. ఇలాంటి వారు సరైన అవగాహన లేకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం వల్ల లేనిపోనిచిక్కుల్లోపడటం ఖాయం అంటున్నారు నిపుణులు..
Updated on: Dec 26, 2024 | 12:41 PM

నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసం కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధం. కానీ నిమ్మరసం నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోకపోవడమే మంచిదట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఎసిడిటీని పెంచే గుణం కలిగిన నిమ్మరసం ఎసిడిటీ రోగులకు అంత మంచిది కాదు.

దంత సమస్యలు ఉన్నవారికి లెమన్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. నిమ్మకాయలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దంతాల మీద ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా, దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ మాత్రమే కాకుండా చాలా ఆక్సలేట్ కూడా ఉంటుంది.

అందువల్ల ఈ నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత సమస్య కూడా తీవ్రమవుతుంది.





























