- Telugu News Photo Gallery Business photos Best Business Ideas: Surgical Cotton Manufacturing Business Money Making Tips
Business Idea: తిరుగులేని వ్యాపారం.. ఎప్పటికీ తగ్గని డిమాండ్.. ఈ బిజినెస్‌తో ప్రతీ నెలా లక్షల్లో ఆదాయం
తిరుగులేని వ్యాపారం ఇది.. దీనికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. కానీ ఖర్చు ఎక్కువే.. ఎంతైతే పెట్టుబడి పెడితే.. అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది. మరి ఆ బిజినెస్ ఏంటి.? ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓసారి లుక్కేయండి.
Updated on: Aug 11, 2025 | 5:12 PM

ప్రతీ ఒక్కరికి వ్యాపారం చేయాలనుంటుంది. ముఖ్యంగా కొందరికి జాబ్ చేయడం కన్నా.. తాను సంపాదిస్తూ.. మరికొందరికి ఉపాధి కల్పించాలని అనుకుంటారు. మరి అలాంటివారి కోసం ఓ సరికొత్త బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం.

మెడికల్ రంగం ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది. ఈ మెడికల్ రంగంలో కాటన్ బిజినెస్.. ది బెస్ట్ వ్యాపారం అని చెప్పొచ్చు. శస్త్రచికిత్సలు, ఫస్ట్ ఎయిడ్ ఇలా.. ఏదైనా కూడా సర్జికల్ కాటన్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ అనుగుణంగా ఈ కాటన్ బిజినెస్ ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

మొదటిగా ఈ కాటన్ తయారీ బిజినెస్‌కు హోల్‌సేల్‌లో పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పత్తిలో కొన్ని కెమెకిల్స్ వేసి వాషింగ్ చేసి.. ఆపై దాన్ని శుభ్రం చేసి పట్టిని సర్జికల్ కాటన్‌గా తయారు చేయాలి. దానికంటూ కొన్ని రకాల మిషిన్లు కావాలి. చివరిగా పత్తిని రౌండ్ షేప్‌లో ప్యాకింగ్ చేసి వివిధ రకాల బరువుల్లో విక్రయిస్తారు.

అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎంతగాదన్నా ఈ వ్యాపారానికి అవసరమైన మిషిన్లకు రూ. 70 లక్షల వరకు అవుతుంది. అలాగే రా మేటిరియల్స్‌కు ఇంకో రూ. 15 లక్షలు అవసరమవుతాయి. అవసరమైతే దీనికోసం మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు.

ఇక మీరు ఈ బిజినెస్‌కు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగానే ప్రతీ నెలా లాభాలు వచ్చి పడతాయి. నెలకు రూ. లక్షల్లో ఆదాయం వస్తుంది. మీరు ఈ కాటన్ బిజినెస్‌కు సొంత బ్రాండ్ పెట్టుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్‌కు సంబంధించిన వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉంటాయి.




