AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్రకదబ్ర.. అద్భుతమైన డ్రింక్.. రాత్రి పడుకునే ముందు తాగితే..

మీ ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల మీరు పదే పదే డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా మారుతుంది.. దీనికోసం ముఖ్యంగా మీ జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలని కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2025 | 1:40 PM

Share
నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ప్రజల జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం.. చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల మీరు పదే పదే డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా మారుతుంది.. దీనికోసం ముఖ్యంగా మీ జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలని కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనకరమైన చాలా ఆహార కలయికలు ఉన్నాయి. ఈ కాంబినేషన్లలో ఒకటి నల్ల మిరియాలు - పాలు. దీన్ని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 7
అటువంటి పరిస్థితిలో, రాత్రి పడుకునే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కానీ మీరు దానికి నల్ల మిరియాలు జోడిస్తే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

2 / 7
ఈ విషయం గురించి ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభించడమే కాకుండా, ఎముకలు కూడా బలపడతాయన్నారు. ఎందుకంటే పాలలో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. అదనంగా, నల్ల మిరియాలు పాలలో ఉండే పోషకాల శోషణను పెంచుతాయి.. ఇది ఎముకలను బలపరుస్తుంది.

3 / 7
Black Pepper

Black Pepper

4 / 7
దీంతోపాటు నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి.. దీని కారణంగా ఆహారం త్వరగా.. బాగా జీర్ణమవుతుంది. రాత్రిపూట పాలతో కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు బరువు తగ్గాలనుకుంటే నల్ల మిరియాలతో పాలు తాగడం వల్ల మీకు సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.. శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 7
ఎలా తయారు చేయాలి: నల్ల మిరియాల పాలు తయారు చేయడానికి, ఒక గ్లాసు పాలు మీడియం మంట మీద వేడి చేసి, దానికి 1 చిటికెడు నల్ల మిరియాల పొడి కలపండి. బాగా కలిపి 2-3 నిమిషాలు మరిగించాలి.. తద్వారా నల్ల మిరియాల పోషకాలు పాలలో కరిగిపోతాయి. రుచిని పెంచడానికి.. ఆరోగ్యంగా చేయడానికి, మీరు దానికి 1 టీస్పూన్ పసుపును కూడా జోడించవచ్చు.

6 / 7
ఆ తర్వాత దాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. నిద్రపోయే ముందు ఈ పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది.. మంచి నిద్ర వస్తుంది. అయితే, మీకు ఏదైనా అలెర్జీ లేదా గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే, దానిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.

7 / 7