- Telugu News Photo Gallery Bizzare protest by leaving ducks on the roads in Guntur District, Andhra Pradesh
Andhra Pradesh: అయ్యో బాబోయ్.. రోడ్లపై బాతులు వదిలి వినూత్న నిరసన.
గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వానలతో చాలావరకు లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. కొన్నిచోట్ల చెట్లు కూలిపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అయితే గుంటురులో మాత్రం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. దీంతో అక్కడి రోడ్లు దుస్థితిని చూపించేందుకు బాతులు వదిలి టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.
Updated on: Jul 29, 2023 | 1:32 PM

గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వానలతో చాలావరకు లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. కొన్నిచోట్ల చెట్లు కూలిపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అయితే గుంటురులో మాత్రం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. దీంతో అక్కడి రోడ్లు దుస్థితిని చూపించేందుకు బాతులు వదిలి టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

గత కొంతకాలంగా కార్పోరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణ జరుగుతుంది. దీంతో రోడ్లపై పెద్ద గుంతలు పడి స్థానికులు సమస్యలు పడుతున్నారు. ముఖ్యంగా రత్నగిరి కాలనీ, ఏటి అగ్రహారంలో రోడ్లు మరమ్మతులు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీనికి తోడు వర్షాలు పడుతుండటంతో గుంతల్లో నీరు నిలిచిపోయింది. నీరు నిలవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ నేతలు వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే రోడ్లు చెరువులుగా మారాయని వాటిని చూపిస్తూ అక్కడ బాతులను వదిలి పెట్టారు.

ఇవి రోడ్లు కాదు చెరువుల అంటూ బాతులను విడిచి పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుంటూరు నగరంలో రోడ్ల మరమ్మత్తులను చేపట్టాలని డిమాండ్ చేశారు.

గతంలోనూ ఇదే రోడ్డుపై వరి నాట్లు వేశామని అయినా ఇప్పటికీ మరమ్మత్తులు చేయలేదని తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి అన్నారు. చివరికి ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు.