Rajasthan: వర్షాకాలంలో రాజస్థాన్ లో ఈ ప్రదేశాలు.. చూస్తే ఔరా అనాల్సిందే..

దేశంలో అత్యధిక వేడి ప్రాంతం రాజస్థాన్.. థార్ ఎడారి లో ఉన్న ఈ  ప్రాంతం అత్యంత ఉష్ణోగ్రత కలిగి అయినప్పటికీ.. రాజస్థాన్ సహజ సౌందర్యం చాలా మంది ప్రయాణికులను ఆకర్షిస్తుంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రదేశాలు వర్షాకాలం లేదా శీతాకాలంలో మరింత అందంగా మారుతాయి. వాటి గురించి ఇప్పుడు  తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula

|

Updated on: Jul 24, 2024 | 3:39 PM

మౌంట్ అబూ: రాజస్థాన్‌లోని మౌంట్ అబూ రాష్ట్రంలోని ఆకర్షణీయమైన ప్రదేశం. ఈ ప్రదేశము హనీమూన్ డెస్టినేషన్‌గా కూడా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం ఎల్లవేళలా పచ్చదనం ఉన్నప్పటికీ, వర్షాకాలంలో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.

1 / 5
భంగర్ కోట: చిన్న పర్వతాల మధ్య ఉన్న భంగర్ కోట వర్షం కారణంగా పచ్చదనంతో కనుల విందు చేస్తుంది.  దెయ్యాల కోటగా గుర్తింపు పొందిన ఈ కోట అందాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2 / 5
ఉదయపూర్ సిటీ: అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ఉదయపూర్ రాచరిక శైలికే కాకుండా పచ్చదనానికి కూడా పేరుగాంచింది. ఉదయపూర్‌లో అనేక పర్వతాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత వాటి అందం మరింత పెరుగుతుంది.

3 / 5
 జైపూర్ సిటీ: రాజస్థాన్‌లో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే, జైపూర్ నగరాన్ని బెస్ట్ ఎంపిక. దీనిని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. జైపూర్‌లోని అంబర్ ఫోర్ట్‌తో సహా అనేక చారిత్రక ప్రదేశాల అందాలను పర్యాటకులు ఇష్టపడతారు.

4 / 5
జాలోర్: దీన్ని సిటీ అఫ్  గ్రానైట్ అండ్ గ్రాండ్యుర్ అని పిలుస్తారు. జలోర్ కోటలోని 'టోప్ ఖానా' లేదా ఫిరంగి ఫౌండ్రీ జలోర్‌లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ నగరం దాదాపు 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన సుంధ మాత ఆలయానికి కూడా ప్రసిద్ది చెందింది మరియు దేవత చాముండ దేవి భక్తులకు పవిత్రమైనది.

5 / 5
Follow us