శరీరంలో కొవ్వు పెరిగితే.. ఇది అన్ని వ్యాధులకు మూలంగా మారుతుంది. కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) ఇది మంచిది. ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) దీనిని చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు. అయితే, కొలెస్ట్రాల్ శరీరానికి కణాలు, హార్మోన్లను తయారు చేయడానికి పనిచేస్తుంది. కానీ శరీరంలో దాని స్థాయి పెరగడం ప్రారంభమయితే.. అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వాస్తవానికి చెడు జీవనశైలి వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అయితే, కొలెస్ట్రాల్ ను ప్రారంభంలో సహజ పద్ధతుల సహాయంతో నియంత్రించవచ్చు.. కొన్ని రకాల ఆకులతో కొవ్వును తగ్గించుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..